ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: పిల్లలతో కలిసి చలిమంట వేసుకున్న తల్లి.. సడన్‌గా ఎంటరైన పులి.. చివరకు ఏం జరిగిందంటే..

ABN, First Publish Date - 2023-12-02T16:39:49+05:30

తనకు ఇబ్బంది కలిగినా సహిస్తుందేమో గానీ.. తన బిడ్డకు చిన్న కష్టమొచ్చినా తల్లి తట్టుకోలేదు. పిల్లలను కాపాడుకునేందుకు అవసమైతే తన ప్రాణాలను ఇవ్వడానికీ సిద్ధపడుతుంది. అందుకే తల్లి ప్రేమకు మించినది మరోటి లేదు.. అని పెద్దలు అంటూ ఉంటారు. ఇందుకు నిదర్శనంగా...

ప్రతీకాత్మక చిత్రం

తల్లి తనకు ఇబ్బంది కలిగినా సహిస్తుందేమో గానీ.. తన పిల్లలకు చిన్న కష్టమొచ్చినా తట్టుకోలేదు. పిల్లలను కాపాడుకునేందుకు అవసమైతే తన ప్రాణాలను ఇవ్వడానికీ సిద్ధపడుతుంది. అందుకే తల్లి ప్రేమకు మించినది మరోటి లేదు.. అని పెద్దలు అంటూ ఉంటారు. ఇందుకు నిదర్శనంగా నిత్యం మన కళ్ల ముందు ఎన్నో సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, మధ్యప్రదేశ్‌లో ఓ తల్లి తన బిడ్డను కాపాడుకునేందుకు ఏకంగా పులితోనే పోరాడింది. చివరకు ఏం జరిగిందంటే..

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) సిద్ధి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలో అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఝరియా గ్రామంలో కిరణ్ బైగా అనే మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి నివాసం ఉంటోంది. ఈ గ్రామస్తులు అడవులపైనే ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. కిరణ్ బైగా కూడా ఇక్కడే కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషిస్తోంది. అయితే ఇటీవల ఈ గ్రామంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ రోజు ఉదయం కిరణ్ బైగా తన ఇంటి బయట పిల్లలతో కలిసి చలి మంట కాచుకుంటుండగా.. ఊహించని ఘటన చోటు చేసుకుంది. అప్పటికే అక్కడ కాపుకాచి ఉన్న పులి.. ఒక్కసారిగా (Tiger attack on mother and child) వారిపై దాడికి దిగింది. కిరణ్ బైగా పిల్లల్లో ఒకరిని నోటితో పట్టుకుని అడవిలోకి లాక్కెళ్లింది.

Marriage: వధువును తుపాకీతో కాల్చి చంపిన వరుడు.. పెళ్లి రిసెప్షన్‌లో బంధువులంతా చూస్తుండగానే..!

పులి దాడి చేయడంతో షాక్‌కు గురైన కిరణ్ బైగా.. వెంటనే తేరుకుని, తన బిడ్డను ఎలాగైనా కాపాడుకోవాలనే ఉద్దేశంతో పులి వెనుకే పరుగెత్తింది. అడవిలోకి వెళ్లిపోయిన పులిని వెతికి మరీ పట్టుకుంది. అప్పటికే గుక్కపట్టి ఏడుస్తున్న తన బిడ్డను చూసి చలించిపోయింది. ఎలాగైనా బిడ్డను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ముందూ వెనుకా చూడకుండా పులికి ఎదురెల్లింది. ఈ క్రమంలో పులి ఆమెపై కూడా దాడి చేసింది. అయినా ఆమె భయపడకుండా పులితో పోరాడింది. చివరకు పులి వారిని వదిలేసి అడవిలోకి పారిపోయింది. ఈలోగా స్థానికులు అక్కడికి చేరుకుని తీవ్రంగా గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బిడ్డ కోసం ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోరాడిన కిరణ్ బైగాను ప్రజలు ప్రశంసలతో ముంచెత్తారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు కూడా ఆమెను అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: బండరాయి పైనుంచి కింద పడిపోతున్న కుర్రాడు.. కాపాడేందుకు ఫ్రెండ్స్ ప్రయత్నాలు.. చివరకు ఏం జరిగిందంటే..!

Updated Date - 2023-12-02T16:39:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising