కూతురు కోసం ఐదు వేల రూపాయలు అప్పు చేసిన తల్లి.. ఓ రోజు ఆస్పత్రికి తీసుకెళ్లగా బయటపడిన అసలు రహస్యం..
ABN, First Publish Date - 2023-01-31T19:01:16+05:30
ఐదు వేలు అప్పు చేసిన పాపానికి ఆమెకు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు. పూట గడవడం కష్టంగా మారడంతో.. కూతురును పోషించుకోవడం కోసం దిక్కుతోచని స్థితిలో పొరుగింటి వ్యక్తి వద్ద రూ.5000 అప్పుగా తీసుకుంది. అయితే..
ఐదు వేలు అప్పు చేసిన పాపానికి ఆమెకు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు. పూట గడవడం కష్టంగా మారడంతో.. కూతురును పోషించుకోవడం కోసం దిక్కుతోచని స్థితిలో పొరుగింటి వ్యక్తి వద్ద రూ.5000 అప్పుగా తీసుకుంది. అయితే ఈ అప్పు.. చివరకు ముప్పు తెచ్చిపెడుతుందని పాపం ఆమె తెలుసుకోలేకపోయింది. కూతురు ఆరోగ్యం క్షీణించడంతో ఓ రోజు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లింది. చివరకు వైద్యులు చెప్పింది విని.. ఎంత పని జరిగిందంటూ ఆమె తల్లడిల్లిపోయింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) ధామ్‌తరి పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ మహిళ (woman) తన కుమార్తెతో కలిసి నివాసం ఉంటోంది. వీరి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే కావడంతో తల్లి కూలిపనులు చేసుకుంటూ కూతురిని పోషిస్తూ ఉండేది. అయితే ఇటీవల వీరిని ఆర్థిక సమస్యలు (Financial problems) ఒక్కసారిగా చుట్టుముట్టాయి. దీంతో పూట గడవడమే కష్టంగా మారింది. విధిలేని పరిస్థితుల్లో చివరకు తల్లి తన పొరుగున ఉండే 60ఏళ్ల సుదర్శన్ నాగర్చి అనే వ్యక్తి నుంచి 2022 అక్టోబర్‌లో రూ.5000లు అప్పుగా తీసుకుంది. అయితే దీన్ని అవకాశంగా తీసుకున్న సుదర్శన్.. ఆమె ఇంటికి తరచూ వెళ్లి వస్తుండే వాడు. చివరకు ఆమె కూతురుపై కన్నేశాడు. అతడికి బాకీ ఉండడంతో రోజూ వచ్చినా సదరు మహిళ ఏమీ అనేది కాదు.
ఈ క్రమంలో ఓ రోజు బాలికను ఏకంగా తన ఇంటికే తీసుకెళ్లాడు. అనంతరం ఆమెపై అఘాయిత్యానికి (Indecent behavior) పాల్పడ్డాడు. ఇలా అప్పటి నుంచి ఆమెపై బలత్కారం చేస్తూ వచ్చాడు. ఈ విషయం తల్లికి తెలియడంతో.. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అసలే అతడికి డబ్బులు ఇవ్వాలి ఉండడంతో మహిళ కూడా మిన్నకుండిపోయింది. అయితే ఈ క్రమంలో ఇటీవల బాలిక (girl) ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో తల్లి ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లింది. వైద్య పరీక్షల్లో బాలిక మూడు నెలల గర్భవతి (pregnant) అని తేలింది. దీంతో చివరకు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. నేరం అంగీకరించడంతో అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Updated Date - 2023-01-31T19:01:23+05:30 IST