కడుపు నొప్పిగా ఉందంటూ ఏడుస్తున్న కూతురు.. ఆస్పత్రిలో డాక్టర్లు చెప్పింది విని నివ్వెరపోయిన తల్లి.. ఆమె నిర్ణయంతో..
ABN, First Publish Date - 2023-02-02T16:17:52+05:30
విద్యార్థులకు బడి లేదు.. ఆట లేదు. ఆన్‌లైన్ క్లాసుల (Online classes)తో ఇంటికే పరిమితమయ్యారు. అదే అమ్మాయిలకు శాపమైంది. కరోనా వైరస్ (Corona virus) ప్రాణాలను బలి తీసుకుంటే.. ఇంట్లో ఉన్న మానవమృగాలు మాత్రం వావి వరుసలు లేకుండా
అది కోవిడ్ (Covid) కాలం. దేశమంతా లాక్‌డౌన్ (Lockdown). సర్వం బంద్. ఇక విద్యార్థులకు బడి లేదు.. ఆట లేదు. ఆన్‌లైన్ క్లాసుల (Online classes)తో ఇంటికే పరిమితమయ్యారు. అదే అమ్మాయిలకు శాపమైంది. కరోనా వైరస్ (Corona virus) ప్రాణాలను బలి తీసుకుంటే.. ఇంట్లో ఉన్న మానవమృగాలు మాత్రం వావి వరుసలు లేకుండా దారుణాలకు తెగబడ్డారు. ఆనాడు జరిగిన ఘోరానికి కేరళ (Kerala) మంజేరీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు (Fast track court) విధించిన తీర్పును శెభాష్ అంటున్నారు మాతృమూర్తులు.
అది 2021వ సంవత్సరం. భారత్‌ను కరోనా వైరస్ పట్టి పీడుస్తున్న రోజులవి. దాని బారిన పడ్డ ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయారు. వైరస్ పేరు వింటేనే ప్రాణాలు పోయేవి. అలాంటి భయానకమైన సమయంలో వావి వరుసలు మరిచిన ఓ దుర్మార్గపు తండ్రి.. కంటికి రెప్పలా కాపాడాల్సిన కనుగుడ్డు పైనే కాటేశాడు. ఆ మావన మృగానికి మూడు యావజ్జీవ ఖైదుల శిక్ష విధిస్తూ న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. జీవితాంతం జైల్లోనే మగ్గిపోవాలని తేల్చి చెప్పింది. అంతేకాదు ఆరున్నర లక్షల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి రాజేష్ సంచలన తీర్పు వెలువరించారు.
ఇది కూడా చదవండి: వింత సంఘటన.. పరీక్షా కేంద్రంలోనే స్పృహ తప్పి పడిపోయిన ఇంటర్ విద్యార్థి.. అమ్మాయిలే అసలు కారణమట..!
మార్చి నెలలో ఆమె ఇంట్లో ఆన్‌లైన్లో క్లాస్‌లు వింటోంది. ఇంట్లో ఎవరూ లేకపోవడాన్ని గమనించిన తండ్రి.. కూతుర్ని బలవంతంగా బెడ్ రూమ్ (Bedroom)లోకి తీసుకెళ్లి అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ హఠాత్తు పరిణామంతో నిశ్చేష్టురాలై పోయింది. పైగా ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తల్లిని చంపేస్తానని బెదిరించాడు. నోరు తెరిచి ఎవరికీ చెప్పుకోకపోవడంతో ఆ కామాంధుడు మరింత రెచ్చిపోయాడు. ఇలా ఆరు నెలల పాటు వరుసగా కన్న బిడ్డపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎట్టకేలకు పాపం పండే రోజు రానే వచ్చింది.
ఓ రోజు కడుపు నొప్పిగా ఉందంటూ తల్లికి చెప్పగా ఆస్పత్రికి తీసుకెళ్లింది. వైద్యులు పరీక్షించిన తర్వాత గర్భవతి అని చెప్పగానే షాక్ అయింది. ఈ పాపానికి ఒడిగట్టింది కన్నతండ్రేనని చెప్పగానే తల్లి నిర్ఘాంతపోయింది. భార్య ఫిర్యాదు మేరకు కామాంధుడైన భర్తను పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. మెడికల్ టెస్టుల్లో డీఎన్‌ఏ (DNA) నిర్ధారణ కావడంతో లైంగిక దాడికి పాల్పడింది తండ్రేనని తేలింది. దీంతో ధర్మాసనం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా బాధితులు న్యాయం చేసింది. మానవ మృగానికి మూడు యావజ్జీవ ఖైదీలు విధిస్తూ తీర్పు వెలువరించింది.
ఇది కూడా చదవండి: 16 ఏళ్ల బాలికకు తరచూ వాంతులు.. బక్కగా అయిపోతోందంటూ ఆస్పత్రికి తీసుకొచ్చిన తల్లిదండ్రులు.. టెస్టులు చేసి అవాక్కైన డాక్టర్లు..
Updated Date - 2023-02-03T10:19:30+05:30 IST