Namma Yatri App: బెంగళూరు ఆటో డ్రైవర్లా మజాకా.. యాప్ ద్వారా ఒక్క ఏడాదిలోనే రూ.189 కోట్ల సంపాదన..!
ABN, First Publish Date - 2023-10-21T11:54:47+05:30
ప్రయాణాల కోసం ఆన్‌లైన్ యాప్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత నుంచి ప్రయాణికులకు ట్యాక్సీలు, ఆటోలు, బైక్‌పై వెళ్లేందుకు చాలా ఈజీ అయిపోయిందనే చెప్పాలి.
ఇంటర్నెట్ డెస్క్: ప్రయాణాల కోసం ఆన్‌లైన్ యాప్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత నుంచి ప్రయాణికులకు ట్యాక్సీలు, ఆటోలు, బైక్‌పై వెళ్లేందుకు చాలా ఈజీ అయిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే ప్రయాణీకులకు యాప్‌లోనే తాము వెళ్లాల్సిన గమ్యస్థానానికి ఎంత చార్జీ అవుతుందనే విషయం క్లీయర్‌గా తెలిసిపోతుంది. దాంతో డ్రైవర్లతో ఎలాంటి బేరం ఆడాల్సిన అవసరం ఉండదు. గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత అందులో చూపించినంత చెల్లిస్తే సరిపోతుంది. ఇలాగే వచ్చాయి ఓలా (Ola), ఉబర్ (Uber), ర్యాపిడో (Rapido) లాంటి యాప్స్. ఇప్పుడు ఇవి నగర ప్రాంతాలలో విస్తృత సేవలు అందిస్తున్నాయి కూడా. అయితే, కర్ణాటక రాజధాని బెంగళూరులో వీటికి పోటీగా ప్రారంభించిన యాప్ ద్వారా ఆటో డ్రైవర్లు ఏడాదిలోపు సుమారు రూ.189 కోట్లు సంపాదించడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. అలాగే జీరో కమీషన్ విధానం ద్వారా సుమారు రూ. 19 కోట్లు ఆదా చేసుకున్నారట. 2022 నవంబర్‌లో ఓలా, ఉబర్‌కు పోటీగా ‘నమ్మ యాత్రి యాప్’ (Namma Yatri app) ను ఓపెన్ నెట్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్‌డీసీ) సంస్థ ప్రారంభించింది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఆటో డ్రైవర్లు, కస్టమర్లను నేరుగా అనుసంధానం చేయడం ఈ యాప్ ప్రత్యేకత.
Viral News: ప్లీజ్ అంటూ వేడుకున్న కస్టమర్.. చెత్త డబ్బాలోంచి ఆ రెస్టారెంట్ ఓనర్ ఏం తీసి ఇచ్చారంటే..!
ఇక చార్జీల విషయానికి వస్తే..
‘నమ్మ యాత్రి యాప్’ ఛార్జీలు ప్రభుత్వం నిర్ణయించిన ధరల ఆధారంగానే ఉంటాయి. ప్రతి ట్రిప్‌కు రెండు కిలోమీటర్ల దూరం వరకు కనీస ఛార్జీ రూ.30 వసూలు చేస్తారు. ఆపై ఎక్కువ దూరానికి కిలో మీటర్‌కు రూ.15 చొప్పున ఛార్జీ ఉంటుంది. అలాగే కనీస బుకింగ్ ఛార్జీ వచ్చేసి రూ. 10. కాగా, ఆటో డ్రైవర్లు రూ.30 వరకు పెంచుకునే అవకాశం కూడా ఉంది. ఇక మధ్యవర్తులకు ఎలాంటి కమీషన్ ఇవ్వాల్సిన అవసరం లేకపోవడంతో కస్టమర్లు తాము ప్రయాణించిన దూరాన్ని బట్టి ఎంత ఛార్జీ చెల్లిస్తే.. అంతే మొత్తం నేరుగా డ్రైవర్లకే వచ్చేస్తుంది. ఇలా ఈ యాప్ ఇప్పుడు బెంగళూరు ఆటో డ్రైవర్ల (Bengaluru Auto Drivers) పాలిట కల్ప తరువులా మారింది. వారికి కాసుల పంట పండిస్తోంది.
Sad Love Story: బిహార్‌లో సీమా హైదర్ లాంటి లవ్‌స్టోరీ.. కానీ క్లైమాక్స్ మాత్రం విషాదాంతం..!
Updated Date - 2023-10-21T11:56:19+05:30 IST