ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Snake Naresh: పట్టుకున్న పామే కాటేసింది.. స్నేక్‌ క్యాచర్‌ నరేశ్‌ ఇంట్లో కనిపించిన దృశ్యం చూసి..

ABN, First Publish Date - 2023-06-02T15:35:29+05:30

తాను పట్టుకున్న పామే తనకు మృత్యు పాశంగా మారుతుందని స్నేక్‌ క్యాచర్‌ నరేశ్‌ (51) కలలో కూడా ఊహించి ఉండరు. స్నేక్‌ నరేశ్‌ గానే ఖ్యాతి గడించిన ఇతను 27 సంవత్సరాలుగా 40 వేలకు పైగా విష సర్పాలను పట్టుకుని సురక్షితంగా అడవులలోకి వదిలి పెడుతూ వచ్చాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు (ఆంధ్రజ్యోతి): తాను పట్టుకున్న పామే తనకు మృత్యు పాశంగా మారుతుందని స్నేక్‌ క్యాచర్‌ నరేశ్‌ (51) కలలో కూడా ఊహించి ఉండరు. స్నేక్‌ నరేశ్‌ గానే ఖ్యాతి గడించిన ఇతను 27 సంవత్సరాలుగా 40 వేలకు పైగా విష సర్పాలను పట్టుకుని సురక్షితంగా అడవులలోకి వదిలి పెడుతూ వచ్చాడు. విధి వక్రించి మంగళవారం మధ్యాహ్నం తాను పట్టుకున్న పాము తననే కాటు వేయడంతో విషం పాకి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఈ దారుణ సంఘటన చిక్కమగళూరులోని హొసమనె లే అవుట్‌లో సంభవించింది. కొన్ని విష సర్పాలను పట్టుకుని వాటిని తన స్కూటర్‌ డిక్కీలో వేసుకున్న నరేశ్‌ అనంతరం వాటిని బయటకు తీసే ప్రయత్నం చేస్తుండగా సంచిలోంచి ఒక్కసారిగా బయటకు వచ్చిన నల్లతాచు రెండుసార్లు కాటేసినట్టు తెలుస్తోంది. నరేశ్‌ మృతి అనంతరం స్కూటర్‌లోని డిక్కీలో ఉంచిన విషసర్పాలను పట్టేందుకు మరో స్నేక్‌ క్యాచర్‌ ఆరిఫ్‌కు కబురంపారు.

ఈ క్రమంలో నరేశ్‌ వినియోగించే బైక్‌ డిక్కీలో, కారు డిక్కీలో 35కుపైగా వివిధ జాతుల విషసర్పాలు కనిపించడంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అనంతరం నరేశ్‌ నివాసంలోని గదిలో మరో 40 విష సర్పాలు కనిపించాయి. వీటిని పట్టుకుని అడవుల్లోకి సురక్షితంగా వదిలి పెట్టినట్టు చిక్కమగళూరు డీఎఫ్‌ఓ క్రాంతి మీడియాకు తెలిపారు. స్నేక్‌ నరేశ్‌ నివాసంలో ప్రమాద భరితమైన విషసర్పాలు బయట పడ్డంతో అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్రామాలలో తిరుగుతూ విష సర్పాలను పట్టేసిన అనంతరం వాటిలో కొన్నింటినీ నరేశ్‌ అడవులలోకి వదిలి పెట్టకుండా తన ఇంట్లోనే ఉంచుకున్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నాగు పాముల నుంచి విషాన్ని తీసేందుకు ఇలా చేసి ఉండవచ్చునన్న కథనాలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2023-06-02T15:38:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising