ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Funny Video: హాయిగా పడుకున్న కుక్కలను కాళ్లతో తంతూ కెలికిందో అమ్మాయి.. విసుగొచ్చి ఓ శునకం ఏం చేసిందో చూస్తే నవ్వాపుకోలేరు..!

ABN, First Publish Date - 2023-04-19T16:20:16+05:30

తెలిసీతెలీని వయసులో కొందరు పిల్లల చేష్టలు చిత్రవిచిత్రంగా ఉంటాయి. ఎంత చెప్పినా వినకుండా మారాం చేసేవారు కొందరైతే.. తోటి పిల్లలు, జంతువుల పట్ల ఆకతాయిలు చేష్టలు చేసే వారు మరికొందరు ఉంటారు. ఈ క్రమంలో వారు చేసే పనులు కొన్నిసార్లు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలిసీతెలీని వయసులో కొందరు పిల్లల చేష్టలు చిత్రవిచిత్రంగా ఉంటాయి. ఎంత చెప్పినా వినకుండా మారాం చేసేవారు కొందరైతే.. తోటి పిల్లలు, జంతువుల పట్ల ఆకతాయిలు చేష్టలు చేసే వారు మరికొందరు ఉంటారు. ఈ క్రమంలో వారు చేసే పనులు కొన్నిసార్లు కోపం తెప్పిస్తే.. మరికొన్నిసార్లు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉంది కాబట్టి.. ఎక్కడ ఏమూల ఇలాంటి చిన్న ఘటనలు చోటు చేసుకున్నా.. ఇట్టే వైరల్ అయిపోతుంటాయి. ప్రస్తుతం ఓ చిన్న పాపకు సంబంధించిన ఫన్నీ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. హాయిగా పడుకున్న రెండు కుక్కలను ఓ అమ్మాయి.. కాళ్లతో తన్ని మరీ ఇబ్బంది పెడుతుంది. దీంతో చివరకు వాటిలో ఓ కుక్క చేసిన పని చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు..

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా (Viral videos) మారింది. ఇసుక మీద రెండు పెంపుడు కుక్కలు (dogs) హాయిగా పడుకుని రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి. అక్కడే ఆడుకుంటున్న ఓ బాలిక (girl) దృష్టి వాటిపై పడుతుంది. అసలే తెలిసీ తెలీని వయసు కావడంతో.. వాటి వద్దకు వెళ్లి పడుకుంటుంది. పడుకున్న అమ్మాయి పడుకున్నట్లుగా ఉండకుండా తనలోని పిల్ల చేష్టలను బయటకు తీస్తుంది. రెండు కుక్కలనూ రెండు కాళ్లతో తన్నుతూ బాగా ఇబ్బంది పెడుతుంది. వాటిలో ఓ కుక్క బాగా నిద్రపోతూ ఉంటుంది. బాలిక బాలిక పదే పదే తన్నుతూ ఉండడంతో ఉన్నట్టుండి ఉలిక్కిపడి పైకి లేస్తుంది. బాలిక చేసిన పని చూసి ‘‘ హాయిగా పడుకుని ఉంటే నీ గోలేంటీ.. ఉండు నీ పని చెబుతా’’.. అన్నట్లుగా పైకి లేచి ఒకసారి చెవులు గట్టిగా విదిలించుకుంటుంది.

Father: ఈ తండ్రి కథ తెలుసుకోవాల్సిందే.. రక్తం అమ్మి మరీ ఇంట్లోకి సరుకులు కొనుక్కొచ్చి.. కూతురి ఆకలిని తీర్చి.. చివరకు రైలు పట్టాలపై..

పైకి లేచిన కుక్క.. ఏం చేస్తుందబ్బా.. అని అనుకునే లోపే, ముందు కాళ్లతో ఇసుకను తవ్వి బాలికపై పడేలా విరజిమ్ముతుంది. ఇలా వేగంగా రెండు కాళ్లతో ఇసుకను వెదజల్లుతుంది. దీంతో అప్పటిదాకా కుక్కలను ఇబ్బంది పెట్టిన బాలిక.. పైకి లేచి వద్దు నన్ను వదిలేయ్.. అనుకుంటూ అక్కడి నుంచి పాకుతూ వెళ్లిపోతుంది. బాలిక అక్కడి నుంచి దూరంగా వెళ్లే వరకూ కుక్క ఇసుకను తవ్వుతూనే ఉంటుంది. ఈ ఘటనను అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: నడి రోడ్డుపై యువతిని వెంటపడిన వ్యక్తి.. పదే పదే బలవంతం చేస్తుండగా.. చివర్లో సడన్‌గా ఏం జరిగిందంటే..

Updated Date - 2023-04-19T16:20:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising