ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: అంతలోనే సిగ్గు.. ఆ వెంటనే కట్టలు తెంచుకున్న ఆగ్రహం.. ఈ వధువు వింత రియాక్షన్స్ వెనుక అసలు కారణమేంటంటే..

ABN, First Publish Date - 2023-03-21T15:17:37+05:30

సినిమాల్లో హీరో, హీరోయిన్ల ఎంట్రీ సీన్ల సమయంలో ప్రేక్షకులు ఈలలు, కేకలతో థియేటర్లను హోరెత్తిస్తుంటారు. నిజ జీవితంలోనూ చాలా మంది తమని తాము.. హీరో, హోరోయిన్లలాగా భావిస్తుంటారు. అందులోనూ ప్రస్తుతం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

సినిమాల్లో హీరో, హీరోయిన్ల ఎంట్రీ సీన్ల సమయంలో ప్రేక్షకులు ఈలలు, కేకలతో థియేటర్లను హోరెత్తిస్తుంటారు. నిజ జీవితంలోనూ చాలా మంది తమని తాము.. హీరో, హోరోయిన్లలాగా భావిస్తుంటారు. అందులోనూ ప్రస్తుతం సోషల్ మీడియాలో అందుబాటులో ఉంది కాబట్టి.. తమకు నచ్చిన సీన్లకు యాక్టింగ్ చేస్తూ రీల్స్ చేస్తుంటారు. ఇలాంటి కొన్ని వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ వధువుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. సదరు వధువు వివాహ మండపంలోకి సిగ్గుపడుతూ వచ్చింది. అంతలోనే ఆగ్రహానికి గురైంది. ఇలా నిముషాల వ్యవధిలో వింత వింత రియాక్షన్స్ ఇచ్చింది. ఇందుకు కారణం తెలుసుకుని అంతా తెగ నవ్వుకుంటున్నారు.

సోషల్ మీడియాలో ఓ వివాహ కార్యక్రమానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా (Viral videos) మారింది. పెళ్లిళ్లలో వధూవరుల (bride and groom) ఎంట్రీకి సంబంధించి.. చాలా మంది వినూత్నంగా ఆలోచిస్తుంటారు. కొందరు అందరినీ ఆశ్చర్య పరుస్తూ చిత్ర విచిత్రంగా పెళ్లి మంటపంలోకి (wedding hall) ప్రవేశించడం తరచూ చూస్తూనే ఉన్నాం. అలా ఎంట్రీ ఇస్తున్న సమయంలో అందుకు తగ్గట్టుగానే బ్రాంక్‌గ్రౌండ్ సాంగ్ (background song) కూడా సెట్ చేస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వధువు పెళ్లి మంటపంలోకి ఎంట్రీ ఇవ్వగానే వివిధ రకాల రియాక్షన్స్ (reactions) ఇచ్చి.. అందరినీ ఆకట్టుకుంది.

Viral Video: మరీ ఇంత ఆత్మవిశ్వాసం పనికిరాదు బ్రదర్.. ఇతడు చేసిన విన్యాసం.. చివరకు ఏమైందో చూడండి..

మొదట సిగ్గుపడుతూ లోపలికి వచ్చిన ఆమె.. అంతలోనే సీరియస్ అయింది. ఆమె లోపలికి వస్తున్న సమయంలో అందుకు తగ్గట్టుగా పాట ప్లే కాకపోవడంతో సీరియస్ అయింది. ఏంటీ ఈ పాట.. మంచి పాట ప్లే చేయడంటూ అక్కడున్న వారిని ఆదేశిస్తుంది. కాసేపటి వేరే డీజే సాంగ్ (DJ Song) ప్లే అవ్వగానే.. మళ్లీ నవ్వుతూ వీడియోలకు ఫోజ్ ఇస్తుంది. ఇలా కొన్ని నిముషాల వ్యవధిలో అనేక రకాల రియాక్షన్స్ ఇస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు (Funny comments) పెడుతున్నారు.

Viral Video: భార్య పట్ల వృద్ధుడు చూపించిన ప్రేమను చూసి.. ఫిదా అవుతున్న నెటిజన్లు.. ఇంతకీ అతను ఏం చేశాడంటే..

Updated Date - 2023-03-21T15:17:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising