ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఇదేం పనయ్యా బాబూ.. ఈ స్కూటీ హారన్ మోగించగానే వస్తున్న శబ్దాలు విని.. పడీపడీ నవ్వుతున్న జనం..!

ABN, First Publish Date - 2023-08-01T16:40:37+05:30

ప్రతి విషయంలోనూ ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశంతో.. కొందరు యువకులు పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. మరోవైపు సోషల్ మీడియలోనూ ఫేమస్ అవ్వాలనే తపనతో మరింత రెచ్చిపోయి ప్రవర్తిస్తుంటారు. ఇంకొందరు వింత వింత విన్యాసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఈ తరహా...

ప్రతి విషయంలోనూ ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశంతో.. కొందరు యువకులు పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. మరోవైపు సోషల్ మీడియలోనూ ఫేమస్ అవ్వాలనే తపనతో మరింత రెచ్చిపోయి ప్రవర్తిస్తుంటారు. ఇంకొందరు వింత వింత విన్యాసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఈ తరహా వ్యక్తులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వ్యక్తి స్కూటీ హారన్ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఇదేం హారన్‌రా బాబూ... అంటూ నవ్వుకుంటున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు ఎలక్ట్రిక్ స్కూటీ (Electric Scooty) వేసుకుని రోడ్డు పైకి వచ్చాడు. ఇందులో ఎలాంటి విశేషం లేకున్నా.. ఇతడి మోగించిన హారన్ సౌండ్ (Scooty horn) విని అంతా అవాక్కయ్యారు. అడ్డుగా ఉన్న వాహనాలను తప్పుకోమని చెబుతూ మనిషి గొంతుతో రికార్డు చేశారు. హారన్ కొట్టినప్పుడల్లా ఈ వాయిస్ వచ్చేలా ఆ వాహననంలో ఏర్పాట్లు చేశారు. దీంతో రోడ్డుపై ఈ యువకుడు హారన్ కొట్టగానే అంతా పగలబడి నవ్వకున్నారు. మరో బైకులో వెళ్తున్న కొందరు యువకులు.. ఈ హారన్ సౌండ్ విని నవ్వుకున్నారు. మళ్లీ మళ్లీ హారన్ కొట్టాలంటూ అతడితో అన్నారు.

Viral Video: అటూ ఇటూ తిప్పి కింగ్ కోబ్రానే తికమకపెట్టారు.. ఆదమరచి ఉన్న సమయంలో.. చివరికి అతడు చేసిన పని చూడండి..

ఈ హారన్ సౌండ్ విని చుట్టు పక్కల వారంతా ఇదేంటీ మరీ విచిత్రంగా ఉందే.. అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సదరు యువకులు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇదేం హారన్‌రా బాబూ మరీ విచిత్రంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘ఇది వింటే ఎవరైనా దాడి చేయగలరు జాగ్రత్త’’.. అంటూ ఇంకొందరు, ‘‘ఈ హారన్ సౌండ్ అసభ్యకరంగా ఉంది.. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి’’.. అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్‌కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Shocking: వాటర్ బాటిల్‌లో మూత్రాన్ని నింపి.. ఓ విద్యార్థిని స్కూల్‌బ్యాగ్‌లో పెట్టిన కుర్రాళ్లు.. మధ్యాహ్న భోజన సమయంలో..!

Updated Date - 2023-08-01T16:40:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising