Wife: ఓ చిన్న ట్రిక్‌తో నా భార్య రూ.25 వేలు నాకు సేవ్ చేసిందంటూ ఓ భర్త పోస్ట్.. ఫన్నీ కామెంట్స్‌తో సెటైర్లు పేల్చుతున్న నెటిజన్లు..!
ABN, First Publish Date - 2023-03-21T16:20:19+05:30
‘‘పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు.. ఎదురింటి పిన్నిగారి కాసులపేరు చూడు.. ఇరుగుపొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు’’.. అని ఓ సినీ కవి అన్నట్లుగా చాలా మంది భార్యలు.. అవి ఇవీ కొనమంటూ భర్తలను పోరు పెట్టడం చూస్తుంటాం. అలాగే మరికొంత మంది..
‘‘పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు.. ఎదురింటి పిన్నిగారి కాసులపేరు చూడు.. ఇరుగుపొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు’’.. అని ఓ సినీ కవి అన్నట్లుగా చాలా మంది భార్యలు.. అవి ఇవీ కొనమంటూ భర్తలను పోరు పెట్టడం చూస్తుంటాం. అలాగే మరికొంత మంది భార్యలు, అనవసర ఖర్చులు వద్దంటూ భర్తను వారిస్తూ.. పొదుపు చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఖర్చులు తగ్గించే క్రమంలో కొంత మంది మహిళల తెలివి తేటలు చూస్తే.. ఆశ్చర్యం కలుగుతుంటుంది. అలాంటి ఆశ్చర్యానికి గురి చేసే ఓ వార్త.. ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఓ చిన్న ట్రిక్‌తో నా భార్య రూ.25 వేలు నాకు సేవ్ చేసిందంటూ ఓ భర్త పోస్ట్ పెట్టాడు. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌తో సెటైర్లు పేల్చుతున్నారు..
ఓ వ్యక్తి తన భార్య తెలివితేటల గురించి ప్రస్తావిస్తూ.. పోస్టు చేసిన వార్త సోషల్ మీడియాలో వైరల్ (Viral news) అవుతోంది. ఓ వ్యక్తి తమ బెడ్ రూమ్‌లో ప్రొజెక్టర్ (Projector) ఏర్పాటు చేశాడు. అందుకు తగ్గట్టుగా అధునాతన స్క్రీన్‌ను (Advanced screen) ఏర్పాటు చేయాలని భావించాడు. అయితే అందుకోసం సుమారు రూ.20నుంచి రూ.25వేలు అవుతుంది. ఇదే విషయాన్ని తన భార్యతో చెప్పాడు. ‘‘ఏంటీ ఓ చిన్న తెర కోసం అంత ఖర్చు పెట్టడం అవసరమా’’.. అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే తన మెదడుకు పని పెట్టింది. ఆ వెంటనే ఓ తెల్లటి దుప్పటిని (white blanket) ప్రొజెక్టర్ ఎదురుగా వేలాడదీసి, అటూ ఇంటూ రెండు క్లిప్పులను పెట్టింది.
Viral Video: మరీ ఇంత ఆత్మవిశ్వాసం పనికిరాదు బ్రదర్.. ఇతడు చేసిన విన్యాసం.. చివరకు ఏమైందో చూడండి..
దుప్పటి ఏర్పాటు చేసిన అనంతరం ‘‘ఎలా ఉంది ఐడియా!.. ఈ మాత్రం దాని కోసం వేల రూపాయలు ఖర్చు చేయాలా’’.. అని భర్త కళ్లు తెరిపించింది. భార్య తెలివితేటలకు మురిసిపోయిన భర్త.. వెంటనే ఆ ఫొటోలను (Viral photos) సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘‘ఓ చిన్న ట్రిక్‌తో నా భార్య రూ.25 వేలు నాకు సేవ్ చేసింది’’.. అని పేర్కొన్నాడు. దీనిపై నెటిజన్లు కామెంట్ల (Funny comments) వర్షం కురిపిస్తున్నారు. భారతీయ మహిళలా మజాకా.. అంటూ కొందరు, మన మహిళ తెలివితేటలు మామూలుగా ఉండవు మరి.. అని ఇంకొందరు, దుప్పటి ఐడియా బాగుంది.. కానీ దాన్ని ఇస్త్రీ చేసి పెడితే ఇంకా బాగుంటుంది.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
Viral Video: అంతలోనే సిగ్గు.. ఆ వెంటనే కట్టలు తెంచుకున్న ఆగ్రహం.. ఈ వధువు వింత రియాక్షన్స్ వెనుక అసలు కారణమేంటంటే..
Updated Date - 2023-03-21T16:54:37+05:30 IST