Viral Video: హెల్మెట్ కూడా పెట్టుకోకుండా ఏంటీ పని..? ఇలాంటి వాళ్ల వల్లే అమాయకుల ప్రాణాలు పోతున్నాయ్..!
ABN, First Publish Date - 2023-03-16T17:47:18+05:30
జాతర, తిరునాళ్ల తదితర వేడుకల్లో బైకు, కార్లతో విన్యాసాలు చేయడం చూస్తూ ఉంటాం. అయితే కొందరు యువకులు.. జన సంచారం ఉన్న ప్రదేశాలు, రోడ్లపై వివిధ విన్యాసాలు చేస్తూ పక్కనున్న వారినీ ప్రమాదాలకు గురి చేస్తుంటారు. ఇంకొందరు..
జాతర, తిరునాళ్ల తదితర వేడుకల్లో బైకు, కార్లతో విన్యాసాలు చేయడం చూస్తూ ఉంటాం. అయితే కొందరు యువకులు.. జన సంచారం ఉన్న ప్రదేశాలు, రోడ్లపై వివిధ విన్యాసాలు చేస్తూ పక్కనున్న వారినీ ప్రమాదాలకు గురి చేస్తుంటారు. ఇంకొందరు సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రమాదకర విన్యాసాలను చేస్తుంటారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ యువకుడు బైకుపై చేసిన విన్యాసాలకు సంబంధించిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు... హెల్మెట్ కూడా పెట్టుకోకుండా ఏంటీ పని..? ఇలాంటి వాళ్ల వల్లే అమాయకుల ప్రాణాలు పోతున్నాయ్..! అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. ఓ యువకుడు బైకుపై చేసిన విన్యాసాలు (Bike stunts) చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. రద్దీగా ఉన్న రోడ్డుపైకి ఓ వ్యక్తి బైకు వేసుకుని వస్తాడు. పక్కన మరో బైకులో అతడి స్నేహితులు వీడియో తీస్తూ ఉంటారు. హెల్మెట్ (Helmet) పెట్టుకోకుండా బైకుపై కూర్చున్న వ్యక్తి.. రన్నింగ్లో ఉండగా.. కాసేపటి హ్యాండిల్ వదిలేసి కాళ్లు పైన పెట్టుకుని కూర్చుంటాడు. అంతటితో ఆగకుండా బైకు వెళ్తుండగానే.. వెనక్కు జరిగి పూర్తిగా కిందకు దిగుతాడు. వెనుక సీటుపై పడుకుని కాళ్లను రోడ్డుపై ఉంచి కాసేపు అలాగే ముందుకు వెళతాడు.
మధ్య మధ్యలో బైకును పూర్తిగా వదిలేసి, దాని వెంటే పరుగులు పెడతాడు. మళ్లీ బైకును పట్టుకుని, రెండు కాళ్లు ఒకే వైపు ఉంచి సీటుపై కూర్చుంటాడు. చివరకు ముందు చక్రాన్ని పూర్తిగా పైకి లేపి, సీటుపై డాన్సులు చేస్తాడు. ఈ సమయంలో ఏమాత్రం చిన్న తప్పిదం జరిగినా.. ఆ వ్యక్తి ప్రమాదంలో పడడమే కాకుండా పక్కన ఉన్న వారికీ అపాయం కలిగి ఉండేది. ఈ వీడియో చూసిన నెటజన్లు సదరు యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పిచ్చి పనులు మళ్లీ చేయకుండా కఠినంగా శిక్షించాలి.. అంటూ కొందరు, ఎవరూ ఇలాంటి తప్పులు చేయొద్దు.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
Updated Date - 2023-03-16T17:47:18+05:30 IST