ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఇలాంటి భర్త ఉన్నా ఒకటే.. లేకున్నా ఒకటే.. వదిలేయడం బెటర్.. అంటూ ఆ భార్యకు అంతా సలహాలు ఎందుకిస్తున్నారంటే..!

ABN, First Publish Date - 2023-07-01T20:20:20+05:30

కొందరు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. ప్రపంచాన్ని కూడా మర్చిపోతుంటారు. సెల్ఫీల పిచ్చిలో కొందరు, రీల్స్ మాయలో పడి మరికొందరు, గేమ్స్ ఆడుతూ ఇంకొందరు.. చుట్టూ ఏం జరుగుతుందో అన్న కనీస స్పృహ కూడా లేకుండా ప్రవర్తిస్తుంటారు. చిన్న పిల్లలైతే తెలీదు అనుకోవచ్చు.. కానీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొందరు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. ప్రపంచాన్ని కూడా మర్చిపోతుంటారు. సెల్ఫీల పిచ్చిలో కొందరు, రీల్స్ మాయలో పడి మరికొందరు, గేమ్స్ ఆడుతూ ఇంకొందరు.. చుట్టూ ఏం జరుగుతుందో అన్న కనీస స్పృహ కూడా లేకుండా ప్రవర్తిస్తుంటారు. చిన్న పిల్లలైతే తెలీదు అనుకోవచ్చు.. కానీ పెద్దలు కూడా ఇలాగే ప్రవర్తిస్తుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోనే ఇందుకు నిదర్శనం. పక్కనే అంత ఘోరం జరుగుతున్నా ఆ భర్త పట్టించుకోలేదు. అతడి తీరుతో భార్య కూడా విసిగిపోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఇలాంటి భర్తకు విడాకులు ఇవ్వడం బెటర్ అంటూ సలహాలు ఇస్తున్నారు..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి బెడ్ మీద పడుకుని ఫోన్‌లో (Phone) ఏదో ఆసక్తిగా చూసుకుంటూ ఉన్నాడు. పక్కనే అతడి కూతురు బొమ్మతో ఆడుకుంటూ ఉంది. ఈ క్రమంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ఆడుకుంటూ ఉన్న పాప.. మంచం పైనుంచి కిందకు తొంగి చూస్తుంది. అలా చూసే క్రమంలో అదుపు తప్పి (baby fell from the bed) ధమేల్‌మని కిందపడిపోతుంది. పైనుంచి పడడంతో ఒక్కసారిగా గట్టిగా ఏడుస్తుంది. అయినా మంచంపై ఉన్న తండ్రి (neglectful father) ఏమాత్రం పట్టించుకోడు. పైగా, ఏమీ జరగనట్లుగా తన పనిలో తాను మునిగిపోతాడు. కనీసం కన్నెత్తి కూడా చూడకుండా అలాగే ఫోన్ చూసుకుంటూ ఉంటాడు.

Doctor Video: డాక్టర్ అంటే ఇలా కదా ఉండాల్సింది.. ఇంజెక్షన్ ఇచ్చినా సరే.. ఆ పాప నవ్వుతూనే ఉంది..!

పాప ఏడుపు విన్న తల్లి.. పరుగెత్తుకుంటూ అక్కడికి వచ్చి కిందపడ్డ కూతురిని ఎత్తుకుంటుంది. అంత జరుగుతున్నా ఏమాత్రం పట్టనట్లుగా ఉన్న భర్తను చూసి కోపం కట్టలు తెంచుకుంటుంది. ‘‘పాప కిందపడ్డా.. పట్టించుకోకుండా ఫోన్ చూసుకుంటున్నావ్.. అసలు నువ్వు మనిషివేనా’’.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అయినా భర్త మాత్రం ఏమీ పట్టించుకోకుండా ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. భర్త ప్రవర్తనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఇలాంటి తండ్రి ఉన్నా ఒకటే.. లేకున్నా ఒకటే’’... అని కొందరు, ‘‘ఇలాంటి వాడు భర్తగా ఏమాత్రం పనికిరాడు’’.. అని మరికొందరు, ‘‘ఇతడికి విడాకులు ఇచ్చి ఒంటరిగా బతకడం మేలు’’.. అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Delivery Boy: ఈ డెలివరీ బాయ్‌కు ఇదేం పాడుబుద్ది.. ఓ యువతి పిజ్జా ఆర్డర్ చేస్తే..

Updated Date - 2023-07-01T20:20:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising