ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Funny Video: తలపై చున్నీని వేసుకుని మరీ పాలు తీసేందుకు కూర్చుందో యువతి.. ఆ గేదె చేసిన పనికి నెటిజన్లు ఫిదా..!

ABN, First Publish Date - 2023-02-24T15:42:17+05:30

ఎవరు చేసే పనులు వారు చేస్తే.. ఏ పొరపాట్లు జరగకుండా ఉంటాయి. అంతేగానీ పంతానికి, పౌరుషానికి పోయో.. లేదా పది మంది ముందూ ప్రత్యేకంగా కనిపించాలనే ఉద్దేశంతో.. ఏ పని పడితే ఆ పని చేయడానికి పూనుకుంటే గర్వభంగం అవుతుంది. చివరకు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎవరు చేసే పనులు వారు చేస్తే.. ఏ పొరపాట్లు జరగకుండా ఉంటాయి. అంతేగానీ పంతానికి, పౌరుషానికి పోయో.. లేదా పది మంది ముందూ ప్రత్యేకంగా కనిపించాలనే ఉద్దేశంతో.. ఏ పని పడితే ఆ పని చేయడానికి పూనుకుంటే గర్వభంగం అవుతుంది. చివరకు అందరి ముందూ నవ్వులపాలు కావాల్సి ఉంటుంది. ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో చాలా మంది యువత.. రీల్స్ పేరుతో చిత్రవిచిత్రమైన పనులు చేస్తుంటారు. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఏనుగుతో ఎగసెక్కాలు ఆడి.. చివరకు వాటి ఆగ్రహానికి గురైన వారిని చూశాం, అలాగే కోతి ముందే కోతి చేష్టలు చేసి.. చివరకు బుద్ధి వచ్చిందారా బాబూ!.. అనుకుంటూ పారిపోయిన వాళ్లను కూడా చూశాం. ప్రస్తుతం పాలు తీయడానికి ప్రయత్నించిన ఓ యువతిని చూసి.. నెటిజన్లు పగలబడి నవ్వుకుంటున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. రీల్స్‌కు బాగా అలవాటు పడిందో ఏమో గానీ ఓ యువతి (young woman).. కొత్తగా ప్రయత్నించాలని అనుకుంటుంది. గేదె వద్ద పాలు పితుకుతూ వీడియో తీసి పెడితే.. లైకుల (Reels Likes) వర్షం కురుస్తుందని కొత్తగా ఆలోచిస్తుంది. అనుకున్నట్లుగా ఓ గేదెను (buffalo) సెలెక్ట్ చేసుకుని, ఓ గిన్నె పట్టుకుని పాలు తీసేందుకు సిద్ధమవుతుంది. అప్పటికి గేదె కుడితి నీళ్లు తాగుతూ ఉంటుంది. స్టూల్ మీద కూర్చున్న యువతి.. గిన్నె పట్టుకుని ఇలా పాలు పితికిందో లేదో.. అలా వెంటనే గేదె అలెర్ట్ అవుతుంది.

Viral Video: ప్లాస్టిక్ డబ్బాలో పటాకులు పేల్చిన యువకులు.. ఇందులో వింతేముందీ అంటారా.. అది ఎలా పేలిందంటే..

రోజూ పాలు తీసే (milking) మహిళ అయ్యుంటే.. ఏమీ అనేది కాదేమో గానీ, కొత్తగా యువతి చేష్టలు చూడగానే గేదెకు తిక్క రేగుతుంది. కాలితో ఒక్క తన్ను తన్నుతుంది. అంతే యువతి ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోతుంది. అయ్య బాబోయ్.. పాలు తీయడమంటే.. ఈజీ అనుకున్నా.. ఇంత కష్టం ఉంటుందా.. నావల్ల కాదు బాబోయ్... అని పక్కకు వెళ్లిపోతుంది. చివర్లో గేదె.. ‘‘నీ రీల్స్ కోసం నాతోనే ఎగసెక్కాలు ఆడతావా’’.. అన్నట్లుగా యువతి వైపు చూస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. తింగరి పనులు చేస్తే.. ఇలాగే ఉంటుంది.. అని కొందరు, గేదె బాగా బుద్ధి చెప్పింది.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: ఎవరీ కుర్రాడు.. వెంటనే కాంటాక్ట్ నెంబర్ పంపండంటూ సెలబ్రెటీల ట్వీట్లు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..!

Updated Date - 2023-02-24T15:42:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising