ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: పక్కనున్న వాళ్లు అడిగారు కదా అని డాన్స్ చేసిన నవ వధువు.. అత్తారింట్లో రియాక్షన్ చూసి నెట్టింట కామెంట్స్ ఏంటంటే..!

ABN, First Publish Date - 2023-03-03T18:46:47+05:30

వివాహ సమయాల్లో చాలా మంది వధువులు.. సిగ్గుతో మూడీగా ఉంటారు. అయితే ఇంకొంతమంది వధువులు.. ఎలాంటి మొహమాటం లేకుండా నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు. మరికొందరైతే.. ఏకంగా అందరినీ ఆశ్చర్యపరుస్తూ చిత్రవిచిత్రమైన పనులు చేస్తుంటారు. ఇలాంటి ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

వివాహ సమయాల్లో చాలా మంది వధువులు.. సిగ్గుతో మూడీగా ఉంటారు. అయితే ఇంకొంతమంది వధువులు.. ఎలాంటి మొహమాటం లేకుండా నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు. మరికొందరైతే.. ఏకంగా అందరినీ ఆశ్చర్యపరుస్తూ చిత్రవిచిత్రమైన పనులు చేస్తుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ నవ వధువుకు సంబంధించిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. పక్కనున్న వాళ్లు అడిగారు కదా అని ఓ నవ వధువు తన అత్తారింట్లో డాన్స్ చేసేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే..

సోషల్ మీడియాలో ఓ నవ వధువుకు (new bride) సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. వివాహానంతరం అత్తారింటికి వచ్చిన నవ వధువు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కొత్త కోడలికి స్వాగతం పలికిన బంధువులు.. అత్తారింట్లో అడుగు పెట్టగానే ఏకంగా డాన్స్ (Dance) చేయమంటూ బలవంత పెట్టారు. నా వల్ల కాకు, నాకు డాన్స్ రాదు.. ఇలాంటి సాకులు ఏవీ చెప్పకుండా అత్తింటి వారు అడిగిన వెంటనే రంగంలోకి దిగింది. పంజాబీ పాటకు (Punjabi songs) ఎంతో లయబద్ధంగా డాన్స్ చేసింది. ఏమాత్రం మొహమాటం లేకుండా.. నవ్వుతూ ఆమె చేసిన డాన్స్ చూసి అంతా చప్పట్లతో అభినందించారు.

Viral Video: అమ్మ బాబోయ్.. పెళ్లవుతోందన్న సంతోషంలో ఈ వరుడు అస్సలు ఆగడం లేదుగా.. వధువు రాగానే మనోడు చేసిన పనేంటో మీరే చూడండి..!

ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా నవ వధువు డాన్స్‌కి ఫిదా అయ్యారు. వావ్! ఈ అందమైన వధువు (beautiful bride) .. ఎంతో అందంగా డాన్స్ చేసింది.. అంటూ కొందరు, ఇప్పుడు ఇలా డాన్స్ చేస్తోంది.. రేపు అత్తింటి వారితో డాన్స్ చేయిస్తుంది.. అంటూ మరికొందరు, ఈ వధువును చూస్తుంటే భారతీయ సంస్కృతి ఉట్టిపడుతోంది.. అంటూ ఇంకొదరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోకు ఇప్పటిదాకా లక్షకు పైగా లైకులు (Millions of likes) వచ్చాయి. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ నవ వధువు డాన్స్ చూసి, మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి.

పెళ్లి కూతురి మెడలో పూల దండ వేశాడు.. మరుక్షణమే కుప్పకూలిపోయాడు.. వరుడి మరణానికి డాక్టర్లు చెప్పిన కారణమేంటో విని అంతా షాక్..!

Updated Date - 2023-03-03T19:04:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!