Akshay Kumar: సిగ్గు లేదా అంటూ బాలీవుడ్ హీరోపై నెటిజన్ల ఆగ్రహం.. ఆ వైరల్ వీడియోలో ఏముందంటే..

ABN, First Publish Date - 2023-02-07T11:03:33+05:30

బాలీవుడ్‌లోని స్టార్ హీరోల్లో అక్షయ్ కుమార్ (Akshay Kumar) ఒకరు. ఈ నటుడు ఏడాదికి నాలుగైదు సినిమాలతో ప్రేక్షకులని పలకరిస్తూ ఉంటాడు.

Akshay Kumar: సిగ్గు లేదా అంటూ బాలీవుడ్ హీరోపై నెటిజన్ల ఆగ్రహం.. ఆ వైరల్ వీడియోలో ఏముందంటే..
Akshay Kumar
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌లోని స్టార్ హీరోల్లో అక్షయ్ కుమార్ (Akshay Kumar) ఒకరు. ఈ నటుడు ఏడాదికి నాలుగైదు సినిమాలతో ప్రేక్షకులని పలకరిస్తూ ఉంటాడు. ఈ యాక్టర్ త్వరలో ఓ కాన్‌సర్ట్ కోసం మరికొందరు బాలీవుడ్ నటీనటులతో కలిసి నార్త్ అమెరికా (North America) టూర్‌ (Tour)కి వెళ్లనున్నాడు. దీనికి సంబంధించిన ప్రమోషనల్ వీడియోని అక్షయ్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

దానికి.. ‘ఎంటర్‌టైనర్‌లు 100% ప్యూర్ దేశీ వినోదాన్ని ఉత్తర అమెరికాకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం. మీ సీటు బెల్ట్‌లను కట్టుకోండి. మేము మార్చిలో వస్తున్నాం! ఖతార్ ఎయిర్‌వేస్’ అని అక్షయ్ కుమార్ రాసుకొచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోలో ఓ విషయం మాత్రం నెటిజన్లకి ఆగ్రహం తెప్పించింది.

ఆ ప్రమోషనల్ వీడియోలో గ్లోబ్ (Globe) తిరుగుతుండగా.. నటీనటులు దానిపై నడుస్తూ ఉంటారు. అయితే.. అక్షయ్ కుమార్ మాత్రం షూస్ వేసుకుని ఇండియా మ్యాప్‌పై నడుస్తూ వెళ్లాడు. దీంతో భారతదేశాన్ని అగౌరవపరిచారని పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘అక్షయ్ కుమార్ కెనడియన్ పౌరుడు అయినంత మాత్రాన అతనితో భారతదేశం మ్యాప్‌ను తొక్కించాలా? ఇది ఎలా ఆమోదయోగ్యం అవుతుంది? కెనడియన్లు మంచి వ్యక్తులు అని నేను విన్నాను. వారికి ఏమైంది?’.. ‘సిగ్గు లేదా.. భారతీయులను అవమానించినందుకు మీరు 150 కోట్ల మందికి క్షమాపణలు చెప్పాలి’.. ‘దేశానికి కొంచెమైన గౌరవం ఇవ్వండి’ అని విమర్శలు చేస్తున్నారు. అలాగే మరికొందరైతే ‘కెనడియన్ కుమార్’ అంటూ ఎగతాళి చేస్తున్నారు. దానికి కారణం అక్షయ్‌కి కెనడా పౌరసత్వం ఉండడమే. కాగా.. ఈ వీడియోలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌తో పాటు దిశా పటానీ, నోరా ఫతేహి, మౌని రాయ్, సోనమ్ బజ్వా కూడా ఉన్నారు.

Updated Date - 2023-02-07T11:03:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising