ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

New virus: హెచ్‌3ఎన్‌2 వైరస్.. హాసన్‌లో వృద్ధుడి మృతి

ABN, First Publish Date - 2023-03-11T11:59:47+05:30

కొవిడ్‌ వేరియంట్‌ హెచ్‌3ఎన్‌2 వైరస్‌ సోకి హాసన్‌(Hassan)కు చెందిన 85 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. రాష్ట్రంలో హెచ్‌3ఎన్‌2 వైరస్‌ ద్వారా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

- రాష్ట్రంలో తొలి మృతిగా నమోదు... 50 మందికి వైరస్‌

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ వేరియంట్‌ హెచ్‌3ఎన్‌2 వైరస్‌ సోకి హాసన్‌(Hassan)కు చెందిన 85 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. రాష్ట్రంలో హెచ్‌3ఎన్‌2 వైరస్‌ ద్వారా మృతి చెందిన తొలి వ్యక్తిగా వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. తీవ్రమైన జ్వరం, దగ్గు, గొంతునొప్పితో హాసన్‌లోని ఆలూరుకు చెందిన వృద్ధుడు ఈనెల 1న మృతి చెందాడు. సదరు వృద్ధుడి మృతికి హెచ్‌3ఎన్‌2 వైరస్‌ కారణమని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ రణదీప్‌(Randeep) శుక్రవారం ప్రకటించారు. రాష్ట్రంలో సదరు వైరస్‌ సోకిన బాధితులు 50 మంది కాగా హాసన్‌కు చెందిన వ్యక్తి మృతి చెందాడన్నారు. జ్వరంతో పాటు గొంతునొప్పి కారణంగా మృతి చెందాడు. అతడికి సంబంధించిన ల్యాబ్‌ ఫలితాలు వచ్చాయని కమిషనర్‌ తెలిపారు. 60 ఏళ్లు దాటిన వారు జాగ్రత్తలు పాటించాన్నారు. వైరస్‌ సోకితే కనీసం 5-7 రోజుల పాటు ఇబ్బందికరం ఉంటుందని, ఎట్టి పరిస్థితిలోను వైద్యుల సలహాలు లేకుండా మందులు వాడరాదన్నారు. గర్భిణీలు, వృద్ధులు, పిల్లలకు వైరస్‌ సోకే అవకాశం ఎక్కువని ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

Updated Date - 2023-03-11T11:59:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising