ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శోభనం గదిలో భార్యాభర్తల మధ్య గొడవ.. ఏమైందని బంధువులంతా కంగారుగా అడిగితే ఆ నవవధువు చెప్పిన అసలు నిజాన్ని విని..

ABN, First Publish Date - 2023-03-05T15:38:53+05:30

ఏ ఆడపిల్ల తల్లిదండ్రులైనా కూతురి విషయంలో ఏదైతే జరగకూడదనుకుంటారో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

రెండు కుటుంబాల అంగీకారంతో వారిద్దరికీ పెళ్లి కుదిరింది. బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్ళిజరిగింది. ఏ గొడవా లేకుండా పిల్లల పెళ్ళి జరిగిపోయిందని వధూవరుల తల్లిదండ్రులు సంతోషించారు. ఆ సంతోషంతోనే సంగీత్ వేడుకలో వయసు మరచిపోయి మరీ డాన్సులు చేశారు. కానీ ఏ ఆడపిల్ల తల్లిదండ్రులైనా కూతురి విషయంలో ఏదైతే జరగకూడదనుకుంటారో అదే జరిగింది. శోభనం గదిలోకి వెళ్ళిన నవవధువు గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఆమె అరుపులు విని బయట వేరే గదులలో పడుకున్న అత్తమామలు పరిగెత్తుకొచ్చారు. చివరకు ఆమె చెప్పిన మాట రెండు కుటుంబాలలో కలకలం రేపింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే..

ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రం మెయిన్ పూరి(Mainpuri) జిల్లాలో కిష్ని(kishni) పోలిస్ స్టేషన్ పరిధిలో పంచంపూర్ అనే గ్రామముంది. ఆ గ్రామంలో నివాసం ఉంటున్న దీపేంద్ర కొడుకు వీరేంద్ర సింగ్ కు, జస్వంత్ నగర్ లో నివాసం ఉంటున్న నెక్రం కూతురు సుధకు మార్చి 2వ తేదీన పెళ్ళి జరిగింది. పెద్దలు కుదిర్చిన పెళ్ళి కావడంతో వధూవరులతో పాటు తల్లిదండ్రులు కూడా సంతోషించారు. మార్చి 3వ తేదీన కొత్త జంటను అబ్బాయి ఇంటికి తీసుకొచ్చారు. రాత్రి 11.30వరకు సంగీత్ ఫంక్షన్ ఎంతో సంతోషంగా జరిగింది. అనంతరం అమ్మాయిని శోభనం గదిలోకి పంపిన తరువాత అందరూ వేరువేరు గదులలోకి వెళ్ళి పడుకున్నారు. అమ్మాయి కుటుంబ సభ్యులు వారింటికి వెళ్ళారు. 12గంటల సమయంలో కొత్తజంట ఉన్న గదిలో నుండి అమ్మాయి అరుపులు వినిపించాయి. ఏం జరిగిందోననే కంగారులో అమ్మాయి అత్తమామలు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఏమయ్యిందని అమ్మాయిని అడగ్గా.. మీ అబ్బాయి మగాడు కాదు, నపుంసకుడు అని భోరున విలపించింది.అత్తమామలు అమ్మాయికి నచ్చజెప్పాలని ప్రయత్నించారు. అయితే అమ్మాయి తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పింది.

Read also: బంగారాన్ని దోచేందుకు సొరంగాన్నే తవ్వేశారు.. చివరకు క్షమించండంటూ గోడపై రాసి ఎస్కేప్.. బంగారాన్ని అందుకే తీసుకెళ్లలేదట..!


అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు మొత్తం 20నుండి 22మంది దాకా అబ్బాయి ఇంటికి చేరుకున్నారు. మొదట అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. ఈ రెండు కుటుంబాల గొడవ కాస్తా పోలీసుల వరకు చేరడంతో వారు ఇరు కుటుంబాలను పోలిస్ స్టేషన్ కు తరలించారు. అక్కడ రెండుకుటుంబాలకు నచ్చజెప్పడానికి పోలీసులు కూడా ప్రయత్నించారు. అయితే అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయిని అత్తారింట్లో ఉంచడానికి ఒప్పుకోలేదు. కొత్త జంట తండ్రులు ఇద్దరూ కలసి చర్చించుకుని ఈ సమస్యను తరువాత పరిష్కరించుకుంటామని పోలీసులకు లిఖిత పూర్వక వినతిపత్రం సమర్పించారు. నగలతో పాటు అమ్మాయి అలాగే పుట్టింటికి వెళ్ళేలాగా వారు నిర్ణయం తీసుకున్నారు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులతో వెళ్ళిపోయింది. ఈ సమస్య గురించి తమకు ఎవరూ ఫిర్యాదు ఇవ్వలేదని, ఇస్తే కేసు నమోదు చేసుకుంటామని పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-03-05T19:36:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising