ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Onions: వామ్మో ఉల్లిపాయతో ఎన్ని లాభాలో అని సంబరపడ్డాం.. కానీ ఇన్ని ప్రమాదాలున్నాయని తెలిస్తే..

ABN, First Publish Date - 2023-04-13T18:26:30+05:30

పచ్చి ఉల్లిపాయ(raw onion) తింటే వడదెబ్బ ఆమడ దూరంలో ఆగిపోతుందట. ఇక ఆడవారి జుట్టు సంరక్షణ(hair care) విషయంలోనూ ఉల్లిపాయ ఓ మెట్టు పైనే ఉంటోంది. ఇంత ప్రయోజనకరమైన ఉల్లిపాయ కూడా చేటు చేస్తుందని, ఉల్లి వెనుక ప్రమాదాలు పొంచి ఉన్నాయనే విషయం ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఉల్లి చేసేమేలు తల్లి కూడా చేయదనేది ఎప్పటినుండో జన ప్రాచుర్యంలో ఉన్న సామెత. మామూలు కాలం కంటే వేసవికాలంలో ఉల్లిపాయ(onion) బాగా ఉపయోగించాలని దీనివల్ల వడదెబ్బ(heat stroke) దరిచేరదని వైద్యులు చెబుతున్నారు. పచ్చి ఉల్లిపాయ(raw onion) తింటే వడదెబ్బ ఆమడ దూరంలో ఆగిపోతుందట. ఇక ఆడవారి జుట్టు సంరక్షణ(hair care) విషయంలోనూ ఉల్లిపాయ ఓ మెట్టు పైనే ఉంటోంది. ఇంత ప్రయోజనకరమైన ఉల్లిపాయ కూడా చేటు చేస్తుందని, ఉల్లి వెనుక ప్రమాదాలు పొంచి ఉన్నాయనే విషయం అందరినీ షాక్ కు గురిచేస్తుంది. అసలు ఉల్లి వల్ల పొంచిఉన్న ప్రమాదాలేంటి? తెలుసుకుంటే..

ఉల్లిపాయలో సోడియం(sodium), పొటాషియం(potassium), ఫోలేట్లు(folates), విటమిన్-ఎ(vitamin-A), విటమిన్-సి(vitamin-C), విటమిన్-ఇ(vitamin-E), కాల్షియం(Calcium), మెగ్నీషియం(Magnesium), ఐరన్(iron), ఫాస్పరస్(Phosphorus) మొదలయినవి ఉంటాయి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ(anti inflammatory) గుణాలు పుష్కలంగా ఉంటాయి. యాంటీ అలర్జీ(anti allergy), యాంటీ ఆక్సిడెంట్లు(antioxidants), యాంటీ కార్సినోజెనిక్(anti carcinogenic) గుణాలు ఉంటాయి. ఇలా చెప్పుకుంటే ఉల్లిపాయ గొప్ప సూపర్ పుడ్(super food) కేటగీరిలోకి వస్తుంది. ఉల్లిపాయ గుండె ఆరోగ్యాన్ని(Heart health) సంరక్షిస్తుంది, క్యాన్సర్ కణాలు పెరగకుండా చేస్తుంది(decrease cancer cell). ఎముకలను దృఢంగా(bone strength) మారుస్తుంది, జుట్టు పెరుగుదలకు(hair growth) గొప్పగా సహాయపడుతుంది. ఇన్నిప్రయోజనాలున్న ఉల్లిపాయ ప్రమాదకరమవుతుందంటే కాస్త షాకింగ్ గా అనిపిస్తుంది కానీ నిజమండీ బాబు, ఉల్లిపాయ ఆరోగ్యసమస్యలను తెచ్చిపెడుతుంది కూడా.

Viral Video: ఈ రైతు తెలివి మామూలుగా లేదుగా.. పొలంలో ఉన్న ఈ ట్రాన్స్‌ఫార్మర్ పక్కన ఇదేంటో.. ఎందుకు పెట్టాడో తెలిస్తే..


షుగర్ లెవల్స్ తక్కువగా(Low sugar levels) ఉన్నవారు ఉల్లిపాయను చాలా తగ్గించాలి. షుగర్ లెవల్స్ ను తగ్గించడంలో ఉల్లిపాయ సమర్థవంతంగా పనిచేస్తుంది. అందులో షుగర్ లెవల్స్ తక్కువగా ఉన్నవారు ఉల్లిపాయ దీన్ని తింటే షుగర్ లెవల్స్ మరింత తగ్గిపోయేలా చేస్తుంది.

గర్భిణీ స్త్రీలు(pregnant woman's) కూడా ఉల్లిపాయ తినేవిషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉల్లిపాయ మంటను కలిగిస్తుంది. ఇది డెలివరీ సమయంలో విపరీతమైన నొప్పికి దారితీస్తుంది. గర్భవతులుగా ఉన్న మహిళలు ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు అప్లై చేయడం, పచ్చి ఉల్లిపాయలు తినడం, బిర్యానీ వంటి పదార్థాల కోసం ఉల్లిని ఎక్కువ వినియోగించడం చేయకూడదు.

బిర్యానీలు, మిర్చి బజ్జీలు తినేటప్పుడు చాలామంది పచ్చి ఉల్లిపాయలు(raw onions) తింటూ ఉంటారు. పచ్చి ఉల్లిపాయలలో సాల్మోనెల్లా(salmonella) అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ప్రేగులపై ప్రభావం చూపిస్తుంది. జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది. అలాగే ఉల్లిపాయలో ఫైబర్(fiber) శాతం ఎక్కువగా ఉంటుంది. పచ్చి ఉల్లిపాయ ఎక్కువగా తింటే ఈ ఫైబర్ జీర్ణమవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. ఫలితంగా కడుపునొప్పి, మలబద్దకం సమస్యలు తలెత్తుతాయి.

AC: ఏసీ ఆన్ చేయగానే కొందరికి ఎందుకిలా జరుగుతుంది..? చాలా మందికి తెలియని నిజాలివి..!


Updated Date - 2023-04-13T18:26:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising