24 ఏళ్ల కుర్రాడు.. బరువు 240 కేజీలు.. కేవలం 2 నెలల్లోనే 70 కిలోలు తగ్గిపోయాడు.. అసలు ఈ వింత ఎలా సాధ్యమైందంటే..
ABN, First Publish Date - 2023-02-22T17:09:21+05:30
24 ఏళ్ల కుర్రాడు.. భారీ ఊబకాయం. ఏకంగా 240 కేజీల బరువు. ఇంత బరువుతో నడవడం కష్టమే.. పని చేసుకోవడమూ భారమే. చూసే వాళ్లు విచిత్రంగా చూస్తుంటారు. ఎన్నో అవమానాలు. ఎన్నో ఇబ్బందులు. ఈ ఇక్కట్లు గమనించిన కుర్రాడు.. ఎలాగైనా బరువు తగ్గాలి అని
24 ఏళ్ల కుర్రాడు.. భారీ ఊబకాయం. ఏకంగా 240 కేజీల బరువు. ఇంత బరువుతో నడవడం కష్టమే.. పని చేసుకోవడమూ భారమే. చూసే వాళ్లు విచిత్రంగా చూస్తుంటారు. ఎన్నో అవమానాలు. ఎన్నో ఇబ్బందులు. ఈ ఇక్కట్లు గమనించిన కుర్రాడు.. ఎలాగైనా బరువు తగ్గాలి అని నిర్ణయించుకున్నాడు. ప్రైవేటు హాస్పిటళ్ల చుట్టూ తిరిగాడు. లక్షల్లో ఖర్చవుతుందని చెప్పగానే మైండ్ గిర్రున తిరిగింది. ఇక లాభం లేదనుకుంటన్న సమయంలో చివరికి అక్కడికెళ్లి సుసాధ్యం చేసుకున్నాడు. ఏకంగా రెండు నెలల్లోనే 70 కేజీల బరువు తగ్గాడు. ఇదెలా సాధ్యమైంది. ఎవరు తగ్గించారు. అసలు ఈ వింత ఎలా సాధ్యమైందో తెలుసుకోవాలంటే ఈ వార్త చదవాల్సిందే.
బరువు తగ్గాలనుకుంటన్నారా? అయితే ఈ మందు వాడండి. ఆ మందు వాడండి. ఇలా చేయండి.. అలా చేయండి అంటూ టీవీల్లో ప్రకటనలు చూస్తుంటాం. కొందరు ఏమంటారంటే జిమ్ (Gym)కు వెళ్లాలని.. ఇంకొందరు వ్యాయామం (Exercise)చేయమని సూచిస్తుంటారు. ఇంత చేసినా బరువు తగ్గకపోతే నిరాశే ఎదురవుతోంది. అయితే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా శరీరాన్ని కరిగించి మిరాకిల్ సృష్టించారు డాక్టర్లు. ఇదెక్కడో కాదు. తెలంగాణ రాష్ట్రం (Telangana State)లో ఓ ప్రభుత్వాస్పత్రిలో సర్జరీ (Surgery) చేసి విజయం సాధించారు. ఈ తరహా వైద్యం చేయడం కూడా ఇదే తొలిసారి అని డాక్టర్లు ప్రకటించారు.
హైదరాబాద్ (Hyderabad)లోని గుడిమల్కాపూర్‌కు చెందిన మునీందర్ (24) అనే యువకుడు (Muninder) బాల్యం నుంచి అధిక స్థూలకాయం (obesity)తో ఇబ్బంది పడుతున్నాడు. వయసుతో పాటు బరువు కూడా పెరుగుతూ వచ్చింది. దీంతో నడవడం కూడా కష్టంగా మారింది. తల్లిదండ్రులు.. కొడుకు బాధను చూసి ప్రైవేటు ఆస్పత్రిలో చూపించగా సర్జరీకి రూ.12 లక్షలు ఖర్చవుతుందని చెప్పగానే నిరాశ చెందారు. అంత స్తోమత లేక ఇంటికి వెనుదిరిగారు. చివరికి చేసేదేమీ లేక ఉస్మానియా వైద్యుల (Osmania Doctors)ను సంప్రదించారు. మునీందర్ పడుతున్న బాధను చూసి హాస్పిటల్‌లో చేర్చుకునేందుకు డాక్టర్లు ఓకే చెప్పారు. సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ (Surgical Gastroenterology), ఎండోక్రైనాలజీ, అనస్తీషియా విభాగాలకు చెందిన 15 మంది వైద్య బృందం యువకుడికి బేరియాట్రిక్ సర్జరీ చేయాలని డిసైడ్ అయ్యారు. అనుకున్నట్టుగానే గ్యాస్ట్రిక్ బైపాస్ ద్వారా పొట్ట సైజు తగ్గించడంతో పాటు.. ఫుడ్ ఎక్కువ తీసుకోకుండా నియంత్రించేందుకు ఆహారం స్వీరించే చిన్న పేగును కూడా కొంత మేర తగ్గించారు. ఇలా రెండు నెలల కిందట చేసిన ఈ సర్జరీ సత్‌ఫలితాన్ని ఇచ్చింది. చికిత్స అనంతరం కూడా అక్కడినే డాక్టర్ల పర్యవేక్షణలో వైద్యం అందిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఆహార పరిమాణం తగ్గడంతో పాటు బరువు కూడా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం 240 కేజీల బరువు నుంచి 170 కేజీలకు చేరింది. అంటే దాదాపు 70 కేజీల బరువు తగ్గాడు. అంతేకాకుండా మరో 80-90 కేజీలు బరువు తగ్గే అవకాశం ఉందని డాక్టర్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: రాజభోగం అంటే ఇతడిదే.. ఇంట్లో ఖాళీగా ఉంటోంటే.. భార్యలే ఉద్యోగాలు చేసి భర్తను పోషిస్తున్నారు..!
సాధారణంగా బేరియాట్రిక్ సర్జరీలు ప్రభుత్వాస్పత్రుల్లో చేయడం అరుదు. కానీ యువకుడు మునీందర్ పడుతున్న బాధలు చూసి మానవీయ కోణంలో ఆలోచించి ఉస్మానియా వైద్యులు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. సర్జరీ సమయంలో పలు ఇబ్బందులు పడినట్లు వైద్యులు తెలిపారు. మునీందర్ 240 కేజీల బరువు ఉండడంతో ఆపరేషన్ టేబుల్‌పై పడుకోబెట్టడం కూడా కష్టంగా మారిందని చెప్పారు. శరీరానికి ఇరువైపులా అదనపు బల్లలు ఏర్పాటు చేసి అతి కష్టం మీద సర్జరీ పూరి చేసినట్లు వివరించారు. రాష్ట్ర చరిత్రలోనే ఇలాంటి చికిత్స చేసి విజయం సాధించిన ఉస్మానియా వైద్య బృందాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు (Minister Harish Rao) ప్రత్యేకంగా అభినందించారు.
Updated Date - 2023-02-22T17:20:33+05:30 IST