Viral Video: విమానంలో విరాళాలు అడుగుతున్న పాకిస్థాన్ వ్యక్తి.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో!
ABN, First Publish Date - 2023-07-15T12:14:51+05:30
సాధారణంగా మనం బస్సుల్లోనూ, రైళ్లలోనే ప్రయాణిస్తున్నపుడు కొందరు వ్యక్తులు వచ్చి విరాళాలు అడుగుతుంటారు. తమ ఇంట్లో వాళ్లకు ఆరోగ్యం బాగా లేదనో, ఎక్కడో గుడి కడుతున్నామనో చెప్పి డబ్బులు అడుగుతుంటారు. అయితే విమానం ఎక్కి మరీ అలా అడిగే వాళ్లని ఎప్పుడైనా చూశారా?
సాధారణంగా మనం బస్సుల్లోనూ, రైళ్లలోనే ప్రయాణిస్తున్నపుడు కొందరు వ్యక్తులు వచ్చి విరాళాలు (Donations)అడుగుతుంటారు. తమ ఇంట్లో వాళ్లకు ఆరోగ్యం బాగా లేదనో, ఎక్కడో గుడి కడుతున్నామనో చెప్పి డబ్బులు అడుగుతుంటారు. అయితే విమానం (Flight) ఎక్కి మరీ అలా అడిగే వాళ్లని ఎప్పుడైనా చూశారా? పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి తాజాగా విమానంలో తన తోటి ప్యాసింజర్లను విరాళాలు కోరాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది (Pakistani man asking donations on plane).
వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. విమాన ప్రయాణ సమయంలో ఓ వ్యక్తి లేచి విరాళాల కోసం అడిగాడు. ``మేము మదర్సా కట్టడం కోసం విరాళాలు సేకరిస్తున్నాం. మీరు డబ్బులు ఇవ్వదలచుకుంటే మీరు మా దగ్గరకు రానవసరం లేదు. నేనే మీ దగ్గరకు వస్తా. నేను అడుక్కోవడం లేదు. దయచేసి సహాయం చెయ్యండి`` అని విజ్ఞప్తి చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో పాకిస్థానీ వ్యక్తి విమానంలో ఇలా ప్రవర్తించడం చర్చనీయాంశంగా మారింది.
Viral Video: పులికి కూడా అంత ఈజీ కాదు.. జింక వెనుక పులి పరుగులు.. చివరకు ఏం జరిగిందో చూడండి..
మరికొందరు మాత్రం కేవలం పాపులారిటీ కోసమే ఆ వ్యక్తి అలా చేశాడని కామెంట్లు చేస్తున్నారు. వీడియోలోని వ్యక్తి పాకిస్థాన్‌కు చెందిన యూట్యూబర్ అక్తర్ లావా (Akhtar Lawa) అని, రాజకీయ నాయకుడు, వ్యాపారస్థుడు అయిన లావా తన పాపులారిటీని పెంచుకునేందుకు అలా చేస్తున్నాడని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఈ వీడియోను వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా కొన్ని లక్షల మంది వీక్షించారు.
Updated Date - 2023-07-15T12:15:22+05:30 IST