Viral: ఏంటయ్యా ఇది.. కూతురు మారాం చేస్తోందని బెంజ్ కారు గిఫ్ట్‌గా ఇచ్చాడు.. నెటిజన్లు ఏమంటున్నారంటే..
ABN , First Publish Date - 2023-04-17T14:18:01+05:30 IST
ఆడి పాడే వయసులో స్కూల్‌కు వెళ్లాలంటే చిన్న పిల్లలకు చాలా కష్టంగా ఉంటుంది. స్కూల్‌కు వెళ్లమంటూ మారాం చేయని పిల్లలు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండరేమో. అలాంటి పిల్లలను తల్లిదండ్రులు బుజ్జగించో, బెదిరించో స్కూలుకు పంపుతారు.
ఆడి పాడే వయసులో స్కూల్‌కు వెళ్లాలంటే చిన్న పిల్లలకు చాలా కష్టంగా ఉంటుంది. స్కూల్‌కు వెళ్లమంటూ మారాం చేయని పిల్లలు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండరేమో. అలాంటి పిల్లలను తల్లిదండ్రులు బుజ్జగించో, బెదిరించో స్కూలుకు పంపుతారు. స్కూలుకు వెళితే చాక్లెట్లు, బిస్కెట్లు కొనిస్తామని ఆశ పెడతారు. అయితే మలేసియాకు చెందిన ఓ తండ్రి మాత్రం స్కూలుకు వెళ్లనని మారాం చేస్తున్న తన కూతురిని బుజ్జగించడానికి ఏకంగా కోట్ల రూపాయలు విలువ చేసే బెంజ్ (Mercedes G Wagon) కారు గిఫ్ట్‌గా ఇచ్చాడు.
మలేషియాకు (Malaysia) చెందిన పారిశ్రామికవేత్త ఫర్హానా జహ్రా ఐదేళ్ల కూతురు ఫాతిమా అనారోగ్యం కారణంగా గతేడాది జనవరి నుంచి స్కూలుకు (School) వెళ్లడం మానేసింది. అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత కూడా ఫాతిమా స్కూలుకు వెళ్లేందుకు ఇష్టపడలేదు. కూతురిని తిరిగి స్కూలుకు ఎలా పంపాలో తల్లిదండ్రులకు అర్థం కాలేదు. రాబోయే పుట్టిన రోజుకు తనకు బెంజ్ కారు గిఫ్ట్ ఇస్తే రోజూ స్కూలుకు వెళతానని ఫాతిమా తేల్చి చెప్పింది. దీంతో ఫర్హానా భర్త తన కూతురికి లగ్జరీ ఎస్యూవీ కారును బహుమతిగా ఇచ్చాడు. అప్పట్నుంచి ఫాతిమా స్కూలుకు వెళ్లడం ప్రారంభించింది (Parents Gifts Mercedes Car to their Daughter).
Viral Video: వర్షంలో తడుస్తూ నడుచుకుంటూ వెళ్తోందో మహిళ.. సడన్‌గా నడిరోడ్డు మీద గుర్తు తెలియని ఓ వ్యక్తి ఆమెను ఆపి మరీ..
ఈ విషయాన్ని ఫర్హానా సోషల్ మీడియాలో షేర్ చేసింది. కూతురు స్కూలుకు వెళ్లేలా ప్రోత్సహించేందుకు తన భర్త బెంజ్ కారు బహుమతిగా ఇచ్చాడని పేర్కొంది. దీంతో స్థానిక మీడియాలో ఈ వార్త వైరల్‌గా (Viral News) మారింది. అలాంటి తల్లిదండ్రులను కలిగిన ఫాతిమా ఎంతో అదృష్టవంతురాలని కొందరు అభినందిస్తున్నారు. అడిగినవన్నీ కొనిచ్చి తల్లిదండ్రులు పిల్లలను చెడగొడుతున్నారని మరికొందరు విమర్శించారు.