ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral News: విమానాశ్రయంలో సూట్‌కేస్ మిస్.. ఎయిర్‌ట్యాగ్‌తో అదెక్కడుందో కనిపెట్టాడు కానీ.. ఆ దొంగ చేసిన నిర్వాకమేంటో చూసి..!

ABN, First Publish Date - 2023-03-31T18:03:57+05:30

కోరీ కేసుల్లో నిందితులను గుర్తించడం ఒకప్పుడు చాలా కష్టమయ్యే పని. కానీ ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఎంత పెద్ద కేసునైనా.. చిటికెలో తేల్చేసే వెలుసుబాటు అందుబాటులో ఉంది. పోలీసులకు దొరక్కుండా దొంగలు ఎన్ని తెలివితేటలు ఉపయోగించినా.. కొన్నిసార్లు ..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కోరీ కేసుల్లో నిందితులను గుర్తించడం ఒకప్పుడు చాలా కష్టమయ్యే పని. కానీ ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఎంత పెద్ద కేసునైనా.. చిటికెలో తేల్చేసే వెలుసుబాటు అందుబాటులో ఉంది. పోలీసులకు దొరక్కుండా దొంగలు ఎన్ని తెలివితేటలు ఉపయోగించినా.. కొన్నిసార్లు చిన్న క్లూతో దొరికిపోతుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వార్త ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. విమానాశ్రయంలో సూట్‌కేస్ మిస్సవడంతో ప్రయాణికుడు ఎయిర్‌ట్యాగ్‌తో కనిపెట్టాడు. అయితే చివరగా దొంగ చేసిన నిర్వాకం చూసి షాక్ అయ్యాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో ఓ దొంగ చేసిన నిర్వాకానికి సంబంధించిన వార్త వైరల్‌గా (Viral news) మారింది. జమీల్ అనే వ్యక్తి లాస్ ఏంజెల్స్ నుంచి జార్జియాలోని అట్లాంటాకు (Los Angeles to Atlanta) ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. లగేజ్ కంపార్ట్‌మెంట్‌లో (Luggage compartment) బ్యాగ్ కనిపించకపోవడంతో జమీల్ కంగారుపడ్డాడు. కంపార్ట్‌మెంట్‌ మొత్తం వెతికినా అతడి లగేజీ మాత్రం కనిపించలేదు. చివరకు అతడికి బ్యాగులో ఎయిర్‌ట్యాగ్‌ (Airtag) ఉందనే విషయం గుర్తుకు వచ్చింది. వెంటనే తన బ్యాగులోని ట్రాకింగ్ పరికరం (tracking device) సాయంతో లొకేషన్‌ని ట్రేస్ చేశాడు. అయితే అప్పటికే తన బ్యాగు విమానాశ్రయం (Airport) వెలువల ఉన్నట్లు సూచించడంతో.. ఎవరో చోరీ చేసినట్లు తెలుసుకున్నాడు.

Viral Video: వంటింట్లో సడన్‌గా మంటలు రాగానే ఈ భర్త చేసిన పనికి భార్యలో కట్టలు తెంచుకున్న కోపం.. చెప్పు తీసుకుని మరీ..

అయితే అంతలోనే బ్యాగు ఎయిర్‌పోర్టులోకి వస్తున్నట్లు తెలియడంతో.. వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. చివరగా తన బ్యాగును గుర్తించినా.. తన చొక్కాను దొంగ (thief) వేసుకోవడాన్ని చూసి ఖంగుతిన్నాడు. తన బ్యాగులో మొత్తం $ 3,000 (రూ. 2.4 లక్షలు) విలువైన వస్తువులు ఉన్నాయని పోలీసులకు తెలియజేశాడు. బ్యాగు దక్కినా దొంగ తన దుస్తులు ధరించడం, వస్తువులను పాడు చేయడం బాధ కలిగించిందంటూ సోషల్ మీడియా ద్వారా.. జమీల్ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: అయ్యయ్యో.. వరి చేలో ఈ భార్యాభర్తలు ఇలా దొరికిపోయారేంటి..? ఓ వ్యక్తి సీక్రెట్‌గా వీడియో తీయడంతో..

Updated Date - 2023-03-31T18:03:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising