Viral news: వామ్మో! ఇదెక్కడి వింత.. నీటిపై నడుస్తున్న మహిళ.. దేవత ప్రతిరూపం అంటూ జనం పూజలు..
ABN, First Publish Date - 2023-04-09T18:41:47+05:30
ఎక్కడ ఏ చిన్న విచిత్ర ఘటన చోటు చేసుకున్నా, ఎవరైనా సాధారణానికి భిన్నంగా ప్రవర్తించినా.. వారిని దైవ స్వరూపంగా భావిస్తూ ప్రజలు పూజలు చేయడం చూస్తూనే ఉంటాం. గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. ఇందుకు సంబంధించిన..
ఎక్కడ ఏ చిన్న విచిత్ర ఘటన చోటు చేసుకున్నా, ఎవరైనా సాధారణానికి భిన్నంగా ప్రవర్తించినా.. వారిని దైవ స్వరూపంగా భావిస్తూ ప్రజలు పూజలు చేయడం చూస్తూనే ఉంటాం. గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ మహిళకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది. నీటిపై నడుస్తున్న మహిళ ఫొటోలు, వీడియోలు వైరల్ అవడంతో ప్రజలు ఆమెను దేవతగా పూజిస్తున్నారు. ఈ వార్త ఆ నోటా, ఈ నోటా పడి అందరికీ తెలియడంతో జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ జబల్‌పూర్ జిల్లాలో (Madhya Pradesh Jabalpur District) ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న నర్మదా నదిలోని (Narmada river) తిల్వారా ఘాట్ వద్ద ఓ వృద్ధురాలు చేతిలో సంచి పట్టుకుని నీటిపై (Woman walking on water) నడుస్తూ వెళ్లింది. నీటి పైనే చాలా దూరం అలా నడుస్తూ ఉంది. అయితే ఆమె పాదాలు తప్ప.. శరీరం మాత్రం నీటి పైనే ఉండడం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో (Viral videos) వైరల్ అవడంతో జనం భారీగా తరలి వస్తున్నారు. దేవతకు ప్రతిరూపం అంటూ కొందరు, నర్మదా దేవి.. అంటూ మరికొందరు ఆమెకు పూజలు చేయడం మొదలుపెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు.
విచారణలో సదరు మహిళ.. నర్మదాపురం ప్రాంతానికి చెందిన 51 ఏళ్ల జ్యోతి బాయి అని తెలిసింది. 10 నెలల క్రితం ఆమె తన ఇంటి నుంచి పారిపోయి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. తన తల్లి మానసిక పరిస్థితి బాగోలేదంటూ మిస్సింగ్ రిపోర్టులో కొడుకు పేర్కొన్నట్లు గుర్తు చేశారు. అయితే నీటిపై నడిచిన ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. వృద్ధురాలు నడిచిన ప్రాంతంలో నీటి లోతు తక్కువగా ఉందన్నారు. పుకార్లను ఎవరూ నమ్మొద్దని పిలుపునిచ్చారు. వృద్ధురాలిని ఆమె స్వగ్రామానికి పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇదిలావుండగా, నీటిపై నడుస్తున్న మహిళ ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
Updated Date - 2023-04-09T18:41:47+05:30 IST