ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rare Transparent Fish: ఇలాంటి చేపను ఎక్కడా చూసుండరు.. కళ్లు తప్ప ఆ చేపకు మిగతా అవయవాలు లేవా..?

ABN, First Publish Date - 2023-08-04T15:57:20+05:30

ఈ విశాల విశ్వంలో మనిషి మేధస్సుకు చిక్కని ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. మనుషులను ఆశ్చర్యపరిచే ఎన్నో వింత జంతువులు ఉన్నాయి. అలాంటి ఒక్కో అద్భుతం బయటపడినప్పుడల్లా ఆశ్చర్యపోవడం తప్ప చేసేదేం లేదు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ విచిత్రమైన చేప చాలా మందిని షాక్‌కు గురి చేస్తోంది.

ఈ విశాల విశ్వంలో మనిషి మేధస్సుకు చిక్కని ఎన్నో అద్భుతాలు (Nature Wonders) ఉన్నాయి. మనుషులను ఆశ్చర్యపరిచే ఎన్నో వింత జంతువులు ఉన్నాయి. అలాంటి ఒక్కో అద్భుతం బయటపడినప్పుడల్లా ఆశ్చర్యపోవడం తప్ప చేసేదేం లేదు. తాజాగా వైరల్ అవుతున్న వీడియో (Viral Video)లో ఓ విచిత్రమైన చేప చాలా మందిని షాక్‌కు గురి చేస్తోంది. చూడడానికి ఆ చేప పూర్తిగా పారదర్శకంగా (Transperant fish) ఉంది. కానీ, ఆ చేప లోపలి అవయవాలు (Organs) మాత్రం ఏవీ కనిపించడం లేదు. ఆ చేపను చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.

@ThebestFigen అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక వ్యక్తి ఆ పారదర్శక చేపను తన చేతితో పట్టుకున్నాడు. దానిని పై నుంచి కింద వరకు చూపించాడు. ఆ చేప పూర్తి పారదర్శకంగా ఉంది. కానీ, దాని లోపలి అవయవాలు మాత్రం కనిపించడం లేదు. కళ్లు (Fish Eyes) మాత్రమే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు 17 లక్షల మందికి పైగా వీక్షించారు. 40 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి.

Metro Train: మెట్రో రైల్లో ఒక్క సీటు కోసం ఇంత రచ్చా..? ఒక్కరితో మొదలయి.. చివరకు ఎంత మందితో గొడవయిందంటే..!

ఈ వీడియోపై చాలా మంది నెటిజన్లు తమ అభిప్రాయాలను తెలియజేశారు. ``ఆ చేప లోపలి అవయవాలు కూడా పారదర్శకంగానే ఉంటాయేమో``, ``ఆ చేపకు జీర్ణవ్యవస్థ, వెన్నెముక కూడా లేనట్టు ఉన్నాయి``, ``ప్రకృతిలో ఇదొక అద్భుతం``, ``ఏదైన ప్రమాద వాటిల్లినపుడు అలా పారదర్శకంగా మారిపోయే లక్షణం ఆ చేపకు ఉండి ఉండొచ్చు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-08-04T15:59:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising