ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువతిని బలవంతంగా లాక్కెళ్లిన వ్యక్తి.. వీడియోలో కాపాడండి అంటూ వేడుకోలు.. మరుసటి రోజు చూస్తే..

ABN, First Publish Date - 2023-01-11T20:31:41+05:30

యువతులపై ఇటీవల ఎక్కడ చూసినా దాడులు పెరిగిపోతున్నాయి. ఏదో రకంగా మహిళలను తమ దారిలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఒప్పుకోకపోతే చివరకు అత్యాచారం, హత్యలు చేసేందుకు కూడా వెనుకాడరు. ఉత్తరప్రదేశ్‌లో..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యువతులపై ఇటీవల ఎక్కడ చూసినా దాడులు పెరిగిపోతున్నాయి. ఏదో రకంగా మహిళలను తమ దారిలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఒప్పుకోకపోతే చివరకు అత్యాచారం, హత్యలు చేసేందుకు కూడా వెనుకాడరు. ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఒంటరిగా వెళ్తున్న యువతిని ఓ వ్యక్తి అనుసరిస్తూ వెళ్లాడు. అదును చూసుకుని ఆమెను నోరు మూసి బలవంతంగా ఎత్తుకెళ్లాడు. తర్వాత కాసేపటికి కాపాడండి అంటూ వీడియోలో వేడుకున్నాడు. మరుసటి రోజు అక్కడికి వెళ్లి చూసి.. అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే...

హనీమూన్‌లో అర్ధరాత్రి నిద్ర లేచిన భర్త.. భార్య ఏం చేస్తోందో చూద్దామని వెతగ్గా.. ఎదురుగా..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) బరేలి జిల్లా ఫరీద్‌పూర్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ యువతి (young woman).. శనివారం సాయంత్రం పని మీద బయటికి వెళ్లింది. స్థానిక ప్రాంతానికి చెందిన సునీల్ కుమార్.. ఆమెను అనుసరిస్తూ వెళ్లాడు. నిర్మానుష్య ప్రదేశంలో ఒక్కసారిగా ఆమెపై దాడి చేశాడు. నోరు మూసి బలవంతంగా సమీప అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె దుస్తులు చించేసి (Indecent behavior), అఘాయిత్యం చేసేందుకు ప్రయత్నించాడు. అయితే సదరు యువతి.. ఎలాగోలా అతడి నుంచి విడిపించుకుని ఇంటికి చేరుకుంది.

ప్రియుడితో వివాహిత వీడియో కాలింగ్.. అతను రెచ్చగొట్టడంతో.. మధ్యలో ఉన్నట్టుండి ఆమె చేసిన పని..

జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో సదరు యువకుడికి ఫోన్ చేసిన యువతి కుటుంబ సభ్యులు చంపేస్తామంటూ (Threats) బెదిరించారు. ఈ క్రమంలో నన్ను కాపాడంటి అంటూ సునీల్ కుమార్ వీడియో బయటికి వచ్చింది. మరుసటి రోజు సంఘటనా స్థలానికి వెళ్లి చూస్తే.. సునీల్ ఉరికి వేలాడుతూ కనిపించాడు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తమ కొడుకుని యువతి కుటుంబ సభ్యులే హత్య చేశారని.. మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి.

వరుడు ఇష్టం లేదంటూనే పెళ్లి చేసుకున్న యువతి.. చివరకు అసలు విషయం చెప్పడంతో..

Updated Date - 2023-01-11T20:31:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising