Viral Cow Photo: అరుదైన వింత.. ఆవు చర్మంపై స్మైలీ ఎమోజీ.. విస్తుపోతున్న నెటిజన్లు.. ఇంతకీ ఈ ఆవు ఎక్కడుందంటే..!
ABN, First Publish Date - 2023-03-31T18:47:44+05:30
ప్రకృతిలో వింతలు, విశేషాలకు కొదవే ఉండదు. కొన్నిసార్లు ఆకాశంలో చిత్రవిచిత్రమైన ఆకారాలు కనువిందు చేస్తుంటాయి. మబ్బులన్నీ కలిసి వివిధ రూపాల్ని సంతరించుకోవడం చూస్తుంటాం. అలాగే భూమి మీద కూడా అనేక అద్భుతాలు చోటు చేసుకుంటుంటాయి. ఇప్పుడిదంతా..
ప్రకృతిలో వింతలు, విశేషాలకు కొదవే ఉండదు. కొన్నిసార్లు ఆకాశంలో చిత్రవిచిత్రమైన ఆకారాలు కనువిందు చేస్తుంటాయి. మబ్బులన్నీ కలిసి వివిధ రూపాల్ని సంతరించుకోవడం చూస్తుంటాం. అలాగే భూమి మీద కూడా అనేక అద్భుతాలు చోటు చేసుకుంటుంటాయి. ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నామంటే.. ఆవు దూడకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆవు చర్మంపై స్మైలీ అందరినీ ఆకట్టుకుంటోంది. ఎవరో పెయింట్‌తో డ్రాయింగ్ వేసినట్లుగా ఉన్న ఈ ఎమోజీని చూసి నెటిజన్లు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఈ ఆవు ఎక్కడుందంటే..
సోషల్ మీడియాలో ఓ లేగ దూడకు సంబంధించిన ఫొటో తెగ వైరల్ (Viral photos) అవుతోంది. సాధారణంగా జంతువుల చర్మంపై వివిధ రకాల ఆకారాలతో గుర్తులు ఉంటాయి. కానీ స్మైలీ ఎమోజీ (Smiley Emoji) ఉన్న జంతువులు చాలా అరుదుగా ఉంటాయి. అలాంటి అరుదైన ఈ లేగదూడను (calf) చూడాలంటే ఆస్ట్రేలియాకి (Australia) వెళ్లాల్సిందే. హోల్‌స్టెయిన్-ఫ్రీసియన్ జాతికి చెందిన ఈ లేడ దూడ చర్మంపై ఉన్న స్మైలీ ఎమోజీ చూడటానికి చాలా అందంగా ఉండడంతో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
ఈ జాతికి చెందిన దూడలు ఏడాదిలో సుమారు 700 వరకూ జన్మిస్తాయని, కానీ ఈ దూడ మాత్రం అన్నింటికీ భిన్నంగా ఉందని యజమాని మేగాన్ తెలిపారు. తన దూడ శరీరంపై ఎమోజీని చూసి సంబరపడిపోయిన యజమాని.. దాన్ని ఫొటో తీసి, సోషల్ మీడియాలో (Social media) షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. వావ్! ఆ ఆవు దూడ చాలా అందంగా ఉంది.. అంటూ కొందరు, ఇలాంటి స్మైలీ ఎమోజీ ఆవును ఎక్కడా చూడలేదు.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
Updated Date - 2023-03-31T18:47:44+05:30 IST