ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Marriage Gifts: చెల్లి పెళ్లి అంటే ఎవరైనా నగలో.. వస్తువులో కానుకగా ఇస్తారు.. కానీ ఈ అన్నయ్య ఎలాంటి గిఫ్టులను ఇచ్చాడో చూస్తే..

ABN, First Publish Date - 2023-03-08T18:33:02+05:30

వివాహ కార్యక్రమాల్లో అతిథులకు విందులు, వినోదాలు ఏర్పాటు చేసి తమ దర్పాన్ని చాటుకోవడం సహజమే. అలాగే అతిథులు కూడా పోటీపడి మరీ.. వధూవరులకు ఖరీదైన గిఫ్టులను అందించి తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. కొందరు..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

వివాహ కార్యక్రమాల్లో అతిథులకు విందులు, వినోదాలు ఏర్పాటు చేసి తమ దర్పాన్ని చాటుకోవడం సహజమే. అలాగే అతిథులు కూడా పోటీపడి మరీ.. వధూవరులకు ఖరీదైన గిఫ్టులను అందించి తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. కొందరు ఖరీదైన వస్తువులు, వాహనాలు అందిస్తే, మరికొందరు ఆభరణాలు తదితరాలను బహుమతిగా ఇస్తుంటారు. ఇక చెల్లెళ్ల పెళ్లి జరుగుతుంటే అన్న ఎలాంటి బహుమతులు ఇస్తాడో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే పెళ్లిలో ఓ అన్నయ్య తన చెల్లెలికి ఇచ్చిన గిఫ్ట్ చూస్తే ఆశ్చర్యపోతారు.

బీహార్‌లోని (Bihar) సివాన్‌ పరిధి కత్వార్ గ్రామంలో ఇటీవల ఓ వివాహం (marriage) జరిగింది. గోపాల్‌గంజ్ జిల్లాలోని పహర్‌పూర్ చంగూర్ గ్రామానికి చెందిన అర్చన అనే యువతి వివాహం సందర్భంగా అతిథులంతా పెద్ద ఎత్తున కత్వార్‌ చేరుకున్నారు. ఎవరికి తోచిన విధంగా వారు గిఫ్ట్‌లను తీసుకొచ్చారు. కొందరు వధూవరులకు అత్యంత ఖరీదైన బహుమతులను (Expensive gifts) అందించి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో అంతా వధువు అన్న రాక కోసం ఎదురు చూస్తున్నారు. వధువు సోదరుడు దిగ్విజయ్ నారాయణ్ సింగ్.. పాట్నాలో ఉంటాడు. చెల్లెలి వివాహం సందర్భంగా తరతరాలు గర్తుండిపోయేలా మంచి బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. దీంతో అతను ఏం గిఫ్ట్ తీసుకొస్తాడని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Viral Video: కోటి మందికి పైగా చూసిన వీడియో.. లక్షల కొద్దీ లైకులు.. ఇంతకీ ఈ బురద నీళ్లల్లో ఇతడేం చేస్తున్నాడంటే..

ఓ ట్రక్కులో గ్రామానికి చేరుకున్న శివన్‌ను చూసి అంతా పెద్ద బహుమతి ఉంటుందనుకున్నారు. అయితే అందులో 51 మేలు రకం మామిడి మొక్కలను (Mango plants) చూసి షాక్ అయ్యారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు శివన్ చెప్పాడు. అలాగే అన్నాచెల్లెళ్ల బంధానికి తీపి గుర్తుగా మామిడి మొక్కలను అందించినట్లు తెలిపాడు. వరకట్నాల కోసం హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడుతున్న ప్రస్తుత తరుణంలో అంతా ఇలా పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని మొక్కల పంపిణీ చేపట్టాలని నారాయణ్ సింగ్ పిలుపునిచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో (Viral photos) వైరల్ అవుతున్నాయి. నారాయణ్ సింగ్ తీసుకున్న నిర్ణయంపై నెటిజన్ల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Viral Video: పురి విప్పిన నెమలిపై దాడి చేసిన పులి.. చివరలో ఎవరూ ఊహించని ట్విస్ట్..

Updated Date - 2023-03-08T18:33:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising