ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: విమానంలో వీడియో తీస్తుండగా జారిపడిన ఫోన్.. కింద పడ్డాక అందులో రికార్డైన చివరి దృశ్యం చూస్తే..

ABN, Publish Date - Dec 27 , 2023 | 03:49 PM

ప్రస్తుత సోషల్ మీడియా ప్రపంచంలో కళ్లతో చూసిన ప్రతి దృశ్యాన్నీ వీడియోలు, ఫొటోల రూపంలో భద్రపరచుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది. ఇక పర్యాటక ప్రాంతాలను సందర్శించే సమయంలో కొందరు.. ప్రతి క్షణాన్నీ వదలకుండా తమ ఫోన్లలో బంధిస్తుంటారు. అయితే...

ప్రస్తుత సోషల్ మీడియా ప్రపంచంలో కళ్లతో చూసిన ప్రతి దృశ్యాన్నీ.. వీడియోలు, ఫొటోల రూపంలో భద్రపరచుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది. ఇక పర్యాటక ప్రాంతాలను సందర్శించే సమయంలో కొందరు.. ప్రతి క్షణాన్నీ వదలకుండా తమ ఫోన్లలో బంధిస్తుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. విమానంలో వెళ్తూ వీడియో తీస్తుండగా.. పొరపాటున ఫోన్ జారి కిందపడిపోయింది. అయితే కిందపడ్డాక అందులో రికార్డైన చివరి దృశ్యం చూసి అంతా షాక్ అవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి విమాన ప్రయాణం చేస్తుండగా.. ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. గాల్లోకి వెళ్లాక చుట్టూ కనిపించే అందమైన దృశ్యాలు చూసి, వాటిని తన ఫోన్ కెమెరాలో బంధించాలని ప్రయత్నిస్తాడు. కిటీకీ పక్కన కూర్చుని బయటి దృశ్యాలను రికార్డ్ చేస్తుండగా.. ప్రమాదవశాత్తు ఫోన్ ఒక్కసారిగా (phone fell from the plane) జారి కిందపడిపోతుంది. పైనుంచి అత్యంత వేగంగా కిందకు పడిపోయిన ఫోన్.. ఓ అటవీ ప్రాంతంలో గడ్డి పొదల్లో పడిపోతుంది. అయితే ఆశ్చర్యకరంగా ఫోన్ కింద పడ్డాక కూడా రికార్డ్ అవుతూనే ఉంటుంది. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

Viral Video: గోడ మీద పులి.. చుట్టూ విచిత్రంగా చూస్తున్న జనం.. చివరకు ఏమైందంటే..

ఫోన్ కింద పడిపోయే సమయంలో అటుగా వచ్చిన ఓ పంది గమనిస్తుంది. పరుగు పరుగున ఫోన్ వద్దకు వచ్చి పరిశీలిస్తుంది. కెమెరా దగ్గరగా మూతి పెట్టి వాసన చూస్తుంది. తర్వాత ఫోన్‌ను కొరికే ప్రయత్నం కూడా చేస్తుంది. ఈ దృశ్యాలన్నీ ఫోన్‌లో రికార్డ్ అవుతాయి. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఫోన్ కిందపడ్డాక కూడా పగలకుండా ఎలా ఉందబ్బా’’.. అంటూ కొందరు, ‘‘ఫోన్‌కు బెలూన్ కట్టి పడేశారేమో’’.. అంటూ ఇంకొందరు, ‘‘అంత వేగంగా కిందపడ్డా కూడా.. దృశ్యాలను క్లియర్‌గా రికార్డ్ చేసింది’’.. అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 51వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఇంట్లోకి చొరబడి.. పండు అనుకుని ఉల్లిపాయను ఎత్తుకొచ్చిన కోతి.. కొరికిన తర్వాత దాని రియాక్షన్ చూడండి..

Updated Date - Dec 27 , 2023 | 05:07 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising