ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: మగాళ్ల వీక్‌నెస్‌ను భలే వాడేసుకున్నారుగా.. 10 మంది కుర్రాళ్లు కలిసి ఓ హోటల్‌లో గదిని అద్దెకు తీసుకుని..!

ABN, First Publish Date - 2023-07-22T19:36:31+05:30

ఒక్కొక్కరికి ఒక్కో వీక్‌నెస్‌ ఉంటుంది. అది కొన్నిసార్లు ఎదుటివారికి అవకాశంగా మారుతుంటుంది. కొందరైతే దీన్నే ఆదాయ మార్గంగా మార్చుకుని వివిధ రకాల నేరాలకు పాల్పడుతుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కుర్రాళ్లు కూడా ఇలాంటి నిర్వాకమే చేశారు. మగాళ్ల వీక్‌నెస్‌ని వినూత్నంగా క్యాష్ చేసుకున్నారు. హోటల్‌లో గదిని అద్దెకు తీసుకుని..

ప్రతీకాత్మక చిత్రం

ఒక్కొక్కరికి ఒక్కో వీక్‌నెస్‌ ఉంటుంది. అది కొన్నిసార్లు ఎదుటివారికి అవకాశంగా మారుతుంటుంది. కొందరైతే దీన్నే ఆదాయ మార్గంగా మార్చుకుని వివిధ రకాల నేరాలకు పాల్పడుతుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కుర్రాళ్లు కూడా ఇలాంటి నిర్వాకమే చేశారు. మగాళ్ల వీక్‌నెస్‌ని వినూత్నంగా క్యాష్ చేసుకున్నారు. హోటల్‌లో గదిని అద్దెకు తీసుకుని మరీ ఈ నేరానికి పాల్పడ్డారు. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుందామని వెళ్లిన పోలీసులు.. చివరకు అక్కడి దృశ్యం చూసి షాక్ అయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

రాజస్థాన్ (Rajasthan) సికర్ జిల్లా చౌము ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన 10మంది కుర్రాళ్లు కలిసి మాస్టర్ ప్లాన్ వేశారు. ఇందుకోసం ముందుగా వారు ఇదే ప్రాంతంలోని ఓ హోటల్లో గదిని తీసుకున్నారు. యువకులను టార్గెట్ చేసుకుని కాల్ గర్ల్స్ (Call girls) పేరుతో వల విసిరారు. అయితే ఇందుకోసం వారు ఎలాంటి యాప్‌లు వాడడం గానీ, యువతులను పిలిపించడం గానీ చేయలేదు. వాయిస్ చేంజ్ (Voice change) చేసే మొబైళ్ల సాయంతో గుర్తు తెలియని యువకులకు కాల్ చేసి, యువతి వాయిస్‌తో మాట్లాడేవారు. తర్వాత వారి వాట్సాప్ నంబర్లకు గూగుల్‌లో దొరికే అందమైన యువతుల ఫొటోలను (young women Photos) షేర్ చేసేవారు. వీరి వలలో చిక్కిన యువకులతో మొదట నగదు బదిలీ చేయించుకుంటారు.

Viral Video: చెట్లు నడుస్తాయా..? ఇదేం ప్రశ్న అని అవాక్కవుతున్నారా..? దీన్ని చూస్తే మీకూ ఆ డౌట్ రావడం ఖాయం..!

తర్వాత యువకులకు నకిలీ హోటళ్ల పేర్లు మోసం చేసేవారు. ఇలా చుట్టు పక్కల ప్రాంతాల్లో ఎంతో మందిని యువకులను బురిడీ కొట్టించారు. సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసి.. పది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి వాయిస్ ఛేంజర్ టెక్నాలజీతో కూడిన రెండు మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు య్యూటూబ్ వీడియోలు (YouTube videos) చూసి.. మహిళల వాయిస్ మార్చే డివైజ్‌లు తెప్పించుకున్నట్లు తెలిసింది. ఓ వెబ్‌సైట్ క్రియేట్ చేసిన నిందితులు.. అందులో కొన్ని నంబర్లను ఉంచారు. వాటికి ఫోన్ చేసిన వారితో వాయిస్ మార్చి మాట్లాడేవారని విచారణలో తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వీరి వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో విచారణ చేస్తున్నారు.

Bride: వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాలో బ్రహ్మాజీలా పెళ్లి చేసుకునేందుకు సంబరంగా వధువు ఇంటికి వెళ్లాడు కానీ..!

Updated Date - 2023-07-22T19:36:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising