Viral: చనిపోయిందని పోస్ట్‌మార్టం చేసేందుకు ఆస్పత్రికి తీసుకెళ్తే.. ప్రాణాలతో తిరిగొచ్చిన యువతి.. ఆ ఒక్క మాట చెప్పకపోయి ఉంటే..!
ABN, First Publish Date - 2023-06-20T18:27:38+05:30
అప్పటిదాకా బాగున్న వారు.. అంతలోనే ప్రాణాలు కోల్పోవడం తరచూ చూస్తూనే ఉంటాం. అదేవిధంగా ప్రాణాల మీద ఆశలు వదులుకున్న సందర్భాల్లో సజీవంగా తిరిగొచ్చిన వారి గురించి కూడా వింటూనే ఉంటాం. ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ యువతికి సంబంధించిన వార్త..
అప్పటిదాకా బాగున్న వారు.. అంతలోనే ప్రాణాలు కోల్పోవడం తరచూ చూస్తూనే ఉంటాం. అదేవిధంగా ప్రాణాల మీద ఆశలు వదులుకున్న సందర్భాల్లో సజీవంగా తిరిగొచ్చిన వారి గురించి కూడా వింటూనే ఉంటాం. ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ యువతికి సంబంధించిన వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. యువతి చనిపోయిందనుకుని పోలీసులు.. పోస్ట్‌మార్టం చేసేందుకు తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆమె కుటుంబ సభ్యులు చెప్పిన ఒక్కమాటతో యువతి ప్రాణాలతో బయటపడింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) మీర్జాపూర్ జిల్లా సంత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక సిరిసి కాలువలో జూన్ 18న ఓ యువతి (young woman) అపస్మారక స్థితిలో పడి ఉంది. చుట్టు పక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఆమెలో ఎలాంటి చలనం లేకపోవడంతో అంతా చనిపోయిందని భావించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు కూడా యువతి చనిపోయిందని అనుకున్నారు. చివరకు పోస్ట్‌మార్టం (Postmortem) నిమిత్తం ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. ఇంతలో యువతి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని.. కూతుర్ని చూసి షాక్ అయ్యారు. అప్పటిదాకా బాగున్న తమ కూతురు అంతలోనే ఇలా చనిపోయి ఉండడం చూసి బోరున విలపించారు. అయితే తమ కూతురుకు ఏమీ అయి ఉండదని బలంగా నమ్మారు.
పోస్ట్‌మార్టంకు తరలిస్తున్న పోలీసులతో యువతి కుటుంబ సభ్యులు మాట్లాడి.. ‘‘ఒక్కసారి వైద్యులకు చూపించండి సార్’’.. అని వేడుకున్నారు. దీంతో ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం చేసే ముందు.. స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. అయితే అక్కడ ఊహించని ఘటన చోటు చేసుకుంది. అంతా చూస్తుండగా యువతిలో చలనం వచ్చింది. దీంతో వైద్యులు ఆమెకు వెంటనే చికిత్స ప్రారంభించారు. పరీక్షల్లో యువతి హృదయ స్పందన రేటు సాధారణంగా ఉందని గుర్తించారు. అయితే కొన్నాళ్లుగా ఆమె మానసిక పరిస్థితి (Mental condition) సరిగా లేనట్లు తెలిసింది. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చనిపోయిందనుకున్న యువతి.. ఎట్టకేలకు ప్రాణాలతో ఉందని తెలియడంతో అంతా సంతోషం వ్యక్తం చేశారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Updated Date - 2023-06-20T18:27:38+05:30 IST