Post Office saving schemes: పోస్టాఫీస్ అందిస్తున్న ఈ 5 స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బుకు డబ్బు.. పన్ను ప్రయోజనం..
ABN, First Publish Date - 2023-05-09T14:30:16+05:30
కేంద్రప్రభుత్వ విభాగమైన ఇండియా పోస్ట్ (India post) చక్కటి పెట్టుబడి స్కీమ్స్‌ను ఆఫర్ చేస్తోంది. సేవింగ్, ఆదాయ పన్ను ప్రయోజనం ఈ రెండు లక్ష్యాలతో 5 చక్కటి స్కీమ్స్‌ను అందిస్తోంది. మరి ఈ పథకాలు ఏవి?. వాటి ఫీచర్లు ఏవిధంగా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం...
పెట్టుబడులపై చక్కటి లాభంతోపాటు పన్ను మినహాయింపు కూడా లభిస్తే పెట్టుబడిదారుడికి అంతకుమించిన సంతోషం ఇంకేముంటుంది!! ముఖ్యంగా చిన్నమొత్తంలో సేవింగ్స్ చేసేవారు ఇలాంటి స్కీమ్స్‌నే ఎంచుకుంటారు. ఇలాంటివారి కోసం కేంద్రప్రభుత్వ విభాగమైన ఇండియా పోస్ట్ (India post) చక్కటి పెట్టుబడి స్కీమ్స్‌ను ఆఫర్ చేస్తోంది. సేవింగ్, ఆదాయ పన్ను ప్రయోజనం ఈ రెండు లక్ష్యాలతో 5 చక్కటి స్కీమ్స్‌ను అందిస్తోంది. మరి ఈ పథకాలు ఏవి?. వాటి ఫీచర్లు ఏవిధంగా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం...
ఆదాయ పన్ను: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)..
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (Public Provident Fund) ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్. దీని ద్వారా వినియోగదారులు డబ్బు పొదుపు చేసుకోవచ్చు. మెచ్యూరిటీపై వడ్డీ కూడా పొందొచ్చు. ఈ స్కీమ్ ప్రస్తుతం 7.1 శాతం వార్షిక చక్రవడ్డీని అందిస్తోంది. మరో ప్రయోజనం ఏంటంటే.. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద ఇన్వెస్టర్లు రూ.1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాలు పొందొచ్చు.
ఇన్‌కమ్ ట్యాక్స్ సేవింగ్: పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ అకౌంట్ (TD)..
ఇండియా పోస్ట్ అందిస్తున్న, అందరికి బాగా తెలిసిన ఇన్వెస్టింగ్ స్కీమ్స్‌లో ‘పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ అకౌంట్ (TD) ఒకటి. ఈ స్కీమ్ అందరికీ అందుబాటులో ఉన్నప్పటికీ.. బ్యాంకులు వెసులుబాటు లేక, ఇన్వెస్ట్‌మెంట్ అవకాశాలులేని గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో వారికి ఈ స్కీమ్ ప్రయోజనకరంగా ఉంది. ఈ స్కీమ్‌లో రూ.1000 కనీస మొత్తంతో పెట్టుబడి మొదలుపెట్టొచ్చు. ఆ తర్వాత బహుళ రూ.100 ల్లో అపరిమితంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్‌ను ఎంచుకునేవారు 5 ఏళ్ల టీడీపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపును పొందొచ్చు.
ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్: సుకన్య సమృద్ధి యోజన (SSY)..
బాలికల ప్రయోజనార్థం కేంద్రప్రభుత్వం అందిస్తున్న చక్కటి సేవింగ్స్ స్కీమే సుకన్య సమృద్ధి యోజన (SSY). వయసు పదేళ్లలోపు బాలిక పేరుమీద ఖాతాను తెరవొచ్చు. బాలిక వయసు 18 ఏళ్లు దాటిన తర్వాత ఖాతాకు యజమానురాలిగా మారుతుంది. ఈ ప్లాన్ ప్రస్తుత వడ్డీ రేటు 8 శాతంగా ఉంది. ఈ స్కీమ్‌లో చేరేందుకు కనీస డిపాజిట్ రూ.250గా ఉంది. ఈ స్కీమ్ కింద గరిష్ఠంగా రూ.1,50,000 వరకు డిపాజిట్ చేయవచ్చు. ఫైనాన్సియల్ సేవింగ్స్‌తోపాటు ఆదాయ పన్నుచట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాన్ని పొందొచ్చు.
ఇన్‌కమ్ ట్యాక్స్: సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)..
60 ఏళ్లుపైబడిన వారందరికీ ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. పెట్టుబడి కనీస మొత్తం రూ.1000 కాగా గరిష్ఠ మొత్తం రూ.15 లక్షలుగా ఉంది. 5 ఏళ్ల కాలపరిమితిని మెచ్యూరిటీ తర్వాత అదనంగా మూడేళ్లపాటు పొడిగించుకోవచ్చు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కింద జనవరి, డిసెంబర్ మధ్య డిపాజిట్లపై 8 శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తోంది. ఆదాయ పన్నుచట్టం 1961లోని సెక్షన్ 80సీ కింద సీనియర్ సిటిజన్లు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఇన్‌కమ్ ట్యాక్స్ స్కీమ్: నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC)...
ఇండియా పోస్ట్ అందిస్తున్న ‘నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్’ (NSC) స్కీమ్ ఒక ఫిక్స్‌డ్-ఇన్‌కమ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్(fixed-income investment scheme). కేంద్ర ప్రభుత్వ సపోర్ట్ చేస్తున్న ఈ స్కీమ్ మెచ్యూరిటీ పిరియడ్ 5 సంవత్సరాలుగా ఉంది. పెట్టుబడి గరిష్ఠ మొత్తంపై ఎలాంటి పరిమితి లేదు. రూ.100తో కూడా ఇన్వెస్ట్‌మెంట్ మొదలుపెట్టొచ్చు. ఈ స్కీమ్‌లో పెట్టుబడి ద్వారా ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాన్ని పొందొచ్చు.
Updated Date - 2023-05-09T14:32:32+05:30 IST