Cyber Crime: రూ.45 లక్షల స్కామ్ నుంచి తెలివిగా తప్పించుకున్న మహిళ.. మ్యాట్రిమోనీ సైట్ అడ్డాగా ఇంత జరుగుతోందా..!
ABN, First Publish Date - 2023-08-22T21:53:28+05:30
ప్రస్తుత రోజుల్లో వినూత్నంగా ఆలోచించాలే గానీ.. సంపాదనకు సవాలక్ష మార్గాలున్నాయి. ఆన్‌లైన్ వేదికగా ఇంట్లో కూర్చునే లక్షలు సంపాదించవచ్చు. అయితే సక్రమమైన మార్గంలో సంపాదించాలని ఆలోచించే వారితో పాటూ.. చాలా మంది నేరస్థులు కూడా ఇలాగే ఆలోచిస్తూ ఉంటారు. అమాయకులను..
ప్రస్తుత రోజుల్లో వినూత్నంగా ఆలోచించాలే గానీ.. సంపాదనకు సవాలక్ష మార్గాలున్నాయి. ఆన్‌లైన్ వేదికగా ఇంట్లో కూర్చునే లక్షలు సంపాదించవచ్చు. అయితే సక్రమమైన మార్గంలో సంపాదించాలని ఆలోచించే వారితో పాటూ.. చాలా మంది నేరస్థులు కూడా ఇలాగే ఆలోచిస్తూ ఉంటారు. అమాయకులను బురిడీ కొట్టించడానికి సవాలక్ష మార్గాలను వెదుకుతుంటారు. చివరకు ఎక్కడో చోట.. ఎవరో ఒకరు .. వీరి ఉచ్చులో చిక్కుకుని విలవిల్లాడిపోతుంటారు. అయితే కొందరు మాత్రం తెలివిగా వ్యవహరించి.. ఇలాంటి సైబర్ నేరస్థుల నుంచి చాకచక్యంగా తప్పించుకుంటుంటారు. అలాంటి మహిళకు సంబంధించిన వార్త.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మ్యాట్రిమోనీ సైట్ల ద్వారా జరుగుతున్న పెద్ద స్కాం నుంచి ఆమె తెలివిగా తప్పించుకుంది. వివరాల్లోకి వెళితే..
ఓ మహిళకు షాదీ.కామ్ అనే సైట్‌లో అకౌంట్ ఉంది. దీంతో ఆమెకు తరచూ వాట్సప్ మెసేజ్‌లు (Whatsapp message) వస్తూ ఉంటాయి. వారికి ఆమె సమాధానాలు కూడా ఇస్తూ ఉంటుంది. ఇదిలావుండగా, ఇటీవల ఆమె వాట్సప్‌కు ఓ మెసేజ్ వచ్చింది. విదేశాలకు వెళ్లేవారికి ఇమ్మిగ్రేషన్‌లో (Immigration) ఇబ్బందులు ఎదుర్కొనే వారికి సహాయపడే కంపెనీకి ఫ్రీలాన్సర్‌గా పని చేస్తున్నట్లు పరిచయం చేసుకున్నాడు. అప్పటికే ఆమె కెనడా వెళ్లాలని ఆలోచనలో ఉండడంతో అతడితో రెండు రోజుల పాటు చాటింగ్ చేసింది. తన సంస్థ కోసం క్లయింట్‌ల కోసం వెతుకుతున్నానంటూ ఆమెకు చెబుతూ వచ్చాడు. అలాగే మరికొందరు మహిళలతో మాట్లాడించి ఆమెను నమ్మించే ప్రయత్నం చేశాడు.
Viral Video: ఏం కలుపుతున్నార్రా బాబూ.. పొరపాటున దీన్ని తిన్న వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో..!
ఇలా చివరకు రూ.45లక్షలు కాజేసేందుకు స్కెచ్ వేశారు. వారు ఎలా మోసం చేస్తారన్న విషయాన్ని గ్రహిస్తూ వచ్చిన మహిళ (woman) .. చివరకు అతన్ని బ్లాక్ చేసింది. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా ‘‘షాది.కామ్ స్కామ్’’.. అని ప్రస్తావిస్తూ అపరిచిత వ్యక్తి మోసాన్ని (Cheating) వివరించింది. దీనిపై నెటిజన్లు చాలా మంది తమకు ఎదురైన అనుభవాలను వివరించారు. ‘‘మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లలో ఇలాంటి మోసాలు కూడా జరుగుతున్నాయా’’.. అంటూ కొందరు, ‘‘మొదట అలాగే చెబుతారు.. తర్వాత ఇమ్మిగ్రేషన్‌లో చిక్కుకున్న వారిని విడుదల చేసేందుకు ఖర్చవుతుంది అంటూ మోసం చేస్తారు’’.. అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
Updated Date - 2023-08-22T21:53:28+05:30 IST