Pressure Cooker: ప్రెజర్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా..? ఈ నిజాలు తెలుసుకోవాల్సిందే..!
ABN, First Publish Date - 2023-08-04T12:22:25+05:30
ప్రెజర్ కుక్కర్ సహాయంతో అన్నం, కూరగాయలు, పప్పులు మొదలైనవన్నీ నిమిషాల మీద ఉడికిపోతాయి. పైగా గ్యాస్ కూడా ఆదా అవుతుంది. కానీ..
ఉదయాన్నే భర్త ఆఫీసుకు వెళ్లాలి, పిల్లలు స్కూళ్ళకు వెళ్లాలి. వీళ్లకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం రెండూ ఉదయమే వండి బాక్స్ పంపిచాలంటే ఎంతో వేగంగా వంట పూర్తవ్వాలి. ఇక ఉద్యోగం చేసే మహిళలు అయితే ఒకవైపు వంట చేస్తూ, మరొక వైపు తాము తయారవుతూ యంత్రాల్లా మారిపోతారు. ఈ కారణంగా చాలామంది మహిళలు వంట చేయడానికి ఎంచుకునే పరికరం ప్రెజర్ కుక్కర్. దీని సహాయంతో అన్నం, కూరగాయలు, పప్పులు మొదలైనవన్నీ నిమిషాల మీద ఉడికిపోతాయి. పైగా గ్యాస్ కూడా ఆదా అవుతుంది. చాలామంది మహిళలు అన్నాన్ని ప్రెజర్ కుక్కర్లో వండుతుంటారు. ఇలా ప్రెజర్ కుక్కర్ లో వండిన అన్నం తినకూడదని మరికొందరు అంటుంటారు. అసలింతకూ ప్రెజర్ కుక్కర్లో వండిన అన్నం తినొచ్చా? ప్రెజర్ కుక్కర్ లో వండే వంట విషయంలో నిజానిజాలు తెలుసుకంటే..
ప్రెజర్ కుక్కర్లో(pressure cooker food) ఆహారం ఉడుకుతున్నప్పుడు ఆవిరి బయటకు వెళ్లదు. ఈ ఆవిరి కాస్తా ఉష్టోగ్రతగా రూపాంతరం చెంది ఆహారం తొందరగా ఉడకడానికి సహాయపడుతుంది. ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఆహారం ఉడుకుతుంది కాబట్టి ఇది ఆరోగ్యానికి మంచిది కాదని కొందరంటే, ఎక్కువ ఉష్టోగ్రత ఉన్నా చాలా తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఇది ఆరోగ్యం అని మరికొందరు అంటారు. ఇలా కుక్కర్ వంట గురించి విభిన్న వాదనలు ఉన్నాయి. అయితే కుక్కర్లో వండే ఆహారాన్ని బట్టి దాని ఫలితాలుంటాయని అంటున్నారు. అన్నం కుక్కర్లో వండితే అది చాలా బరువుగా మారుతుంది(rice cooking in pressure cooker). పిండిపదార్థాలను ఇలా ప్రెజర్ కుక్కర్లో ఉడికించినప్పుడు యాక్రిలామైడ్ అనే రసాయనాన్ని ఏర్పరుస్తాయి. ప్రతిరోజూ కుక్కర్లో వండిన అన్నాన్ని తింటే యాక్రిలామైడ్ కారణంగా క్యాన్సర్, వంధ్యత్వం, నాడీ సంబంధ జబ్బులు చాలా తొందరగా చుట్టుముడతాయి.
Tax Notice: ఇదేం ట్విస్ట్ బాబోయ్.. 10 ఏళ్ల క్రితమే చనిపోయిన మహిళకు ట్యాక్స్ నోటీస్.. రూ.7.56 కోట్ల పన్ను కట్టండంటూ..!
ఆహారనిపుణులు ప్రెజర్ కుక్కర్ లో వంట గురించి చెబుతూ బిజీ రోజుల్లో, ఎప్పుడైనా తప్పని పరిస్థితులల్లో ప్రెజర్ కుక్కర్ లో అన్నం వండుకుని తింటే పర్వాలేదు. కానీ ప్రతిరోజూ ఇదే పద్దతి ఫాలో అవ్వడం ఆరోగ్యానికి ప్రమాదమని అంటున్నారు. వంట చేయడానికి కేవలం కుక్కర్ వినియోగం మీద ఆధారపడకుండా ఇతర పద్దతుల్లో వంట చేయడానికి మెల్లిగా అలవాటు పడాలి. తినే ఆహారం రుచిగా ఉందా లేదా అన్నదే కాదు, ఎలా వండారనేది కూడా అందరూ తెలుసుకోవలసిన ముఖ్య విషయం.
Bhavish Aggarwal: ప్రేయసి దగ్గర అప్పులు చేసి మరీ పెట్టిన కంపెనీయే.. ఇప్పుడు ఫుల్లు ఫేమస్.. ఇతడెవరో గుర్తు పట్టారా..?
Updated Date - 2023-08-04T12:22:25+05:30 IST