Viral Video: ఇంట్లోకి వచ్చిన కొండచిలువను చూసి సంతోషంతో ఎగిరిగంతేసిన యజమాని.. అది మోసుకొచ్చిందేంటో తెలిస్తే అవాక్కవుతారు..
ABN, First Publish Date - 2023-10-29T21:55:39+05:30
పాములను దూరం నుంచి చూస్తేనే ఒళ్లంతా జలదరిస్తుంది. ఇక ఇళ్ల సమీపంలోకి వస్తే.. పారిపోవడం తప్ప దాని ముందు నిలబడే ధైర్యం దాదాపు ఎవరూ చేయలేరు. ఇక కొండచిలువల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో...
పాములను దూరం నుంచి చూస్తేనే ఒళ్లంతా జలదరిస్తుంది. ఇక ఇళ్ల సమీపంలోకి వస్తే.. పారిపోవడం తప్ప దాని ముందు నిలబడే ధైర్యం దాదాపు ఎవరూ చేయలేరు. ఇక కొండచిలువల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో కొండచిలువ.. ఇంట్లోకి రావడం చూసి యజమాని సంతోషంతో ఎగిరిగంతేశాడు. ఇంతకీ అది ఇంట్లోకి వస్తూ ఏం మోసుకొచ్చిందో చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ కొండచిలువ పాకుతూ పాకుతూ చివరకు ఇళ్ల పరిసరాల్లోకి వచ్చింది. ఓ ఇంటి గడప వద్దకు రావడంతో (python came into the house) మొదట చుట్టు పక్కల వారు భయపడ్డారు. అయితే కొండచిలువను చూసి ఇంటి యజమాని తెగ సంతోషపడ్డాడు. కొండచిలువ తలకు కరెన్సీ నోట్లు (currency notes) ఉండడం చూసి ఎగిరిగంతేశాడు. తలకు తగిలిన నోట్ల కట్టను లాక్కుంటూ వచ్చిన కొండచిలువ.. నేరుగా ఇంట్లోకి తీసుకెళ్లింది. ఇంట్లోకి స్వాగతం పలుకుతున్నట్లుగా గడప కూర్చున్న యజమాని.. కొండచిలువను ఇంట్లోకి వెళ్లి అంటూ ఆదేశిస్తాడు.
ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అరె! ఈ కొండచిలువ ఏదో స్కామ్ చేసినట్లుందే’’.., ‘‘దీనికి డబ్బులు అంటే చాలా పిచ్చి ఉన్నట్టుందే’’.., ‘‘ఆహా! ఇంట్లోకి వచ్చే పాములన్నీ ఇలాగే వస్తే.. ఎంత బాగుంటంది’’.., ‘‘ఇంట్లోకి వెళ్లి నోట్లు లెక్కపెట్టుకుంటుందేమో’’.. అంటూ కొందరు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తుండగా.. ‘‘కొండచిలువ తలకు కావాలనే నోట్లను అలా కట్టేసి వీడియో తీశారు’’.. అంటూ మరికొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో మాత్రం ప్రస్తుతం 17వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Viral Video: ఇతను డాక్టరా.. లేక శాడిస్టా.. అందరి ముందే రోగి పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాడో చూడండి..
Updated Date - 2023-10-29T21:55:39+05:30 IST