Wife-Husband: భార్యాభర్తల మధ్య ఓ పిల్లి పెట్టిన గొడవ.. చివరకు ఆమె ప్రాణాన్నే తీసేసింది.. అసలేం జరిగిందంటే..!
ABN, First Publish Date - 2023-11-22T20:56:11+05:30
దంపతుల మధ్య తలెత్తే సమస్యలకు గల కారణాలు పరిశీలిస్తే.. చాలా వరకు సిల్లీగానే అనిపిస్తుంటాయి. అయినా ఇలాంటి చిన్న చిన్న సమస్యలు కొన్నిసార్లు చాలా పెద్దవి అవుతుంటాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు ఎవరూ ఊహించని...
దంపతుల మధ్య తలెత్తే సమస్యలకు గల కారణాలు పరిశీలిస్తే.. చాలా వరకు సిల్లీగానే అనిపిస్తుంటాయి. అయినా ఇలాంటి చిన్న చిన్న సమస్యలు కొన్నిసార్లు చాలా పెద్దవి అవుతుంటాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు ఎవరూ ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. భార్యాభర్తల మధ్య పెంపుడు పిల్లి విషయంలో గొడవ తలెత్తింది. ఈ గొడవ చివరకు ఆమె ప్రాణాన్నే తీసేసింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
కోల్‌కతా (Kolkata) మాణిక్తాల సమీపంలోని మురారిపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మహదేవ్ సాహా అనే వ్యక్తికి.. భార్య శిల్పి సాహా (41), 16 ఏళ్ల కొడుకు ఉన్నాడు. మహదేవ్ భార్యకు జంతువులను పెంచుకోవడం అలవాటు. ఈ క్రమంలో 18 నెలల క్రితం ఆమె కొన్ని పిల్లులను (cats) ఇంటికి తెచ్చుకుంది. అయితే ఇటీవల ఉన్నట్టుండి వారి కొడుకు అనారోగ్యానికి (illness) గురయ్యాడు. దీంతో మహదేవ్ తన కొడుకును చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరీక్షించిన వైద్యులు బాలుడు డిఫ్తీరియా వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఈ వ్యాధి పిల్లి వెంట్రుకల ద్వారా వ్యాపిస్తుందని వైద్యులు చెప్పారు. దీంతో మహదేవ్ సాహా తన భార్యపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వెంటనే పిల్లులను బయట వదిలేయాలని చెప్పాడు.
పిల్లుల విషయంలో దంపతుల (Quarrels between couples) మధ్య వాగ్వాదం నెలకొంది. తర్వాత ఆమె ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లగా.. మహదేవ్ అక్కడే ఉన్నాడు. ఇంటికి వచ్చిన శిల్పి.. తలుపులు వేసుకుని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎంతకీ తలుపులు తీయకపోవడంతో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చింది. డోర్ బెల్ కొట్టినా ఎవరూ తీయకపోవడంతో చివరకు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. తలుపులు బద్దలుకొట్టి చూడగా.. శిల్పి ఉరికి వేలాడుతూ కనిపించింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్త ఆస్పత్రికి తరలించారు. మహిళ మృతితో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి.
Updated Date - 2023-11-22T20:56:12+05:30 IST