ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ram charan: మా మధ్య పోటీ రాలేదు!

ABN, First Publish Date - 2023-02-09T23:47:40+05:30

తెలుగు చిత్ర పరిశ్రమలో బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అనగానే రామ్‌చరణ్‌ (Ram charan)– ఎన్టీఆర్‌ (Ntr)గుర్తొస్తారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో చేసిన సపాత్రలు అందుకు నిదర్శనం. అంతకుముందే చరణ్‌ – తారక్‌ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగు చిత్ర పరిశ్రమలో బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అనగానే రామ్‌చరణ్‌ (Ram charan)– ఎన్టీఆర్‌ (Ntr)గుర్తొస్తారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో చేసిన సపాత్రలు అందుకు నిదర్శనం. అంతకుముందే చరణ్‌ – తారక్‌ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే! ఎన్నో సందర్భాల్లో వారిద్దరూ ఈ విషయాన్ని చెప్పారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా విడుదల సమయంలో రాజమౌళి 9Rajamouli) కూడా ఈ విషయాన్ని చెప్పారు. తాజాగా రామ్‌చరణ్‌ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని మరోసారి చెప్పుకొచ్చారు. (Ramcharan about Tarak)

ఎన్టీఆర్‌కు ప్రత్యర్థిగా నటించడం మీకు ఎలా అనిపించింది? అన్న ప్రశ్నకు ‘‘ఎలాంటి సన్నివేశం అయినా (RRR)రాజమౌళి చక్కగా తెరకెక్కించగలరు. నేనూ తారక్‌ ఎన్నో సంవత్సరాలు స్నేహితులం. కొన్ని సన్నివేశాలు చేస్తునప్పుడు ఎవరు బాగా చేస్తారనే దాని గురించి పోటీ ఉంటుందేమోనని నేను కొంత భయపడ్డాను. కానీ వృత్తిపరంగా మా మధ్య ఎప్పుడూ పోటీలేదు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా సమయంలో ఎన్నో విషయాలు చర్చించుకున్నాం. ఇద్దరి మధ్య మంచి కంఫర్ట్‌ ఏర్పడేలా చూసుకున్నాం. దాంతో అంతా సౌకర్యంగా జరిగింది. పోటీ అనేది మా మధ్య ఎప్పుడూ సమస్య కాలేదు. రాజమౌళికి అభిమానుల అంచనాలను ఎలా బ్యాలెన్స్‌ చేయాలో బాగా తెలుసు’’ అని అన్నారు. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే! ఎన్నో ప్రతిష్ఠాత్మ అవార్డులు అందుకొంది. తాజాగా ‘నాటు నాటు’ సాంగ్‌ ఆస్కార్‌ నామినేషన్స్‌లో చోటు దక్కించుకుంది.

Updated Date - 2023-02-09T23:51:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising