ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ram Charan: ఆ ఘనత అందుకున్న తొలి తెలుగు హీరోగా రికార్డ్

ABN, First Publish Date - 2023-02-22T16:24:50+05:30

‘గుడ్ మార్నింగ్ అమెరికా’ (Good Morning America)... సాంగ్ కాదు.. కానీ చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) నోటి నుంచి ఈ డైలాగు వస్తే?

Mega Power Star Ram Charan
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘గుడ్ మార్నింగ్ హైదరాబాద్’ (Good Morning Hyderabad)... మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) ‘శంకర్‌దాదా జిందాబాద్’ (Shankar Dada Zindabad) సినిమాలో సాంగ్!

‘గుడ్ మార్నింగ్ అమెరికా’ (Good Morning America)... సాంగ్ కాదు.. కానీ చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) నోటి నుంచి ఈ డైలాగు వస్తే?

వస్తే ఏంటి...?? రాబోతోంది... అది మరికొన్ని గంటల్లోనే!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ ఇప్పుడు అమెరికాకు చేరింది. ప్రఖ్యాత టెలివిజన్ ప్రోగ్రాం ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. ఈ రోజు (ఫిబ్రవరి 22న) ప్రసారం కానున్న టీవీ షోలో రామ్ చరణ్ (Ram Charan) సందడి చేయనున్నారు. ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న న్యూ ఏజ్ స్టార్ రామ్ చరణ్ కావడం గమనార్హం. ఈ ఘనత అందుకున్న తొలి తెలుగు కథానాయకుడిగా (First Telugu Hero) రామ్ చరణ్ చరిత్ర సృష్టించారు. ఈ తరం భారతీయ కథానాయకులలో ఈ ఘనత అందుకున్నది కూడా ఈ మెగా పవర్ స్టారే కావడం విశేషం.

అమెరికాలో మధ్యాహ్నం ఒంటి గంటకు, మన భారతీయ కాలమానం ప్రకారం రాత్రి 11.30 గంటలకు ‘గుడ్ మార్నింగ్ అమెరికా - రామ్ చరణ్’ కార్యక్రమం టెలికాస్ట్ కానుంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్, తర్వాత సంగతులతో పాటు కొత్త సినిమాల గురించి రామ్ చరణ్ ఈ షోలో మాట్లాడనున్నారు.  

ప్రస్తుతం రామ్ చరణ్ ఈ షో నిమిత్తం అమెరికాకు చేరుకున్నారు. సోమవారం రాత్రి ఆయన హైదరాబాద్ నుంచి బయలు దేరి వెళ్ళారు. ఈ నెల 24న జరగనున్న హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ (HCA Awards) ప్రోగ్రాంలో కూడా రామ్ చరణ్ సందడి చేయనున్నారు. ప్రజెంటర్‌గా ఆయన అవార్డ్ ఇవ్వనున్నారు. ఆ ఘనత సాధించిన తొలి ఇండియన్ హీరో కూడా చరణే కావడం గమనార్హం. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ (Golden Globe Awards) వేడుకలో రామ్ చరణ్‌కు అమెరికన్ ఆడియన్స్ నుంచి హ్యూజ్ రెస్పాన్స్ లభించిన విషయం తెలిసిందే. ఇండియన్, గ్లోబల్ ఫ్యాన్స్ ఆయనని మీట్ కావడం కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారంటే.. మెగా పవర్ స్టార్ క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

*********************************

Meena: ‘శుభలగ్నం’ రీమేక్ చేస్తే చేయాలనుకున్నా.. కానీ?


Sir: దర్శకుడే కారణం.. చిరు చెప్పిందే మూర్తిగారు చెప్పారు

Premi Viswanath: అరుదైన వ్యాధి.. ‘కార్తీకదీపం’ వంటలక్క కూడా ఆ బ్యాచ్‌లోకి!


Updated Date - 2023-02-22T17:46:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising