ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: దొంగ ఎలుక.. ఎవరూ లేనపుడు డైమండ్ నెక్లెస్‌ను ఎలా కాజేసిందో చూడండి.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో!

ABN, First Publish Date - 2023-08-02T16:54:36+05:30

ఎలుకలు చాలా సాధారణంగా, చిన్నగానే ఉంటాయి కానీ, అవి కలుగచేసే నష్టం మాత్రం చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది. చరిత్రలోనే అతి భయంకరమన ప్రాణనష్టానికి కారణమైన ప్లేగు వ్యాధిని వ్యాప్తి చేసినవి ఎలుకలే. అంతేకాదు ఇళ్లలోనూ, దుకాణాల్లోనూ తిరిగే ఎలుకలు చాలా ఆస్తి నష్టాన్ని కూడా కలుగచేస్తాయి

ఎలుకలు (Rats) చాలా సాధారణంగా, చిన్నగానే ఉంటాయి కానీ, అవి కలుగచేసే నష్టం మాత్రం చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది. చరిత్రలోనే అతి భయంకరమన ప్రాణనష్టానికి కారణమైన ప్లేగు వ్యాధిని వ్యాప్తి చేసినవి ఎలుకలే. అంతేకాదు ఇళ్లలోనూ, దుకాణాల్లోనూ తిరిగే ఎలుకలు చాలా ఆస్తి నష్టాన్ని కూడా కలుగచేస్తాయి. ఎలుకలు సాధారణంగా ఆహార పదార్థాలను, చిన్న చిన్న వస్తువులను దొంగిలిస్తుంటాయి. అయితే ఓ ఎలుక నగల దుకాణంలో అత్యంత విలువైన వజ్రాల హారాన్ని (Diamond Necklace) చోరీ చేసింది.

ఎలుక డైమండ్ నెక్లెస్ కాజేస్తున్న వీడియో షాప్‌లో అమర్చిన సీసీటీవీ కెమేరాలో రికార్డు అయింది. @cctvidiots అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది (Rat steals Diamond Necklace). వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక జ్యువెలరీ షోరూమ్‌లో ఒక బొమ్మపై వజ్రాల నెక్లెస్ ప్రదర్శన కోసం ఉంచారు. షాప్ మూసేశాక ఒక ఎలుక ఆ బొమ్మకు సమీపంలోకి వచ్చింది. ఆ తర్వాత ఆ బొమ్మ మీదకు వచ్చి డైమండ్ నెక్లెస్‌ని తీసుకుంది. ఆ తర్వాత ఆ ఖరీదైన హారంతో పాటు ఎలుక కూడా మాయమైంది (Viral Video).

Viral Video: నువ్వు గ్రేట్ భయ్యా.. లుంగీ పవర్ ఏంటో చూపించావు! షాపింగ్‌మాల్‌కు వెళ్లిన ఆ వ్యక్తి లుంగీతో ఏం చేశాడంటే..

ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు దాదాపు 9 లక్షల మంది ఆ వీడియోను వీక్షించారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``పాపం.. అప్పుల బాధ ఎక్కువైపోయిందేమో``, ``తన ప్రియురాలికి ఇవ్వడానికి ఆ నెక్లెస్ కాజేసి ఉంటుంది``, ``తన కుటుంబ కష్టాలను తీర్చుకోవడానికి ఆ నెక్లెస్ పట్టుకెళ్లింది`` అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-08-02T18:40:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising