ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: పేరుకే ఎలుక.. మనిషికి ఏమాత్రం తీసిపోదు.. వర్షంలో అది చేస్తున్న పని చూస్తే మీరే ఒప్పుకొంటారు..

ABN, First Publish Date - 2023-07-06T21:46:45+05:30

ఎలుకల లక్షణాలు, ప్రవర్తన.. మనుషులకు దగ్గరగా ఉంటుందనే విషయం తెలిసిందే. అందుకే ఔషదాల తయారీ సమయంలో శాస్త్రవేత్తలు ముందుగా ఎలుకల పైనే ప్రయోగాలు చేస్తుంటారు. ఎలుకలు ఇళ్లల్లో తిరిగే సమయంలో కొన్నిసార్లు మనుషుల మాదిరే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎలుకల లక్షణాలు, ప్రవర్తన.. మనుషులకు దగ్గరగా ఉంటుందనే విషయం తెలిసిందే. అందుకే ఔషదాల తయారీ సమయంలో శాస్త్రవేత్తలు ముందుగా ఎలుకల పైనే ప్రయోగాలు చేస్తుంటారు. ఎలుకలు ఇళ్లల్లో తిరిగే సమయంలో కొన్నిసార్లు మనుషుల మాదిరే ప్రవర్తించడం చూస్తూ ఉంటాం. అలికిడి వినపడగానే.. అచ్చం మనిషిలాగే దాక్కుంటూ ఉంటాయి. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. వర్షంలో ఓ ఎలుక ప్రవర్తన చూసి అంతా అవాక్కవుతున్నారు. అచ్చం మనిషిలాగే వర్షంలో ఎంజాయ్ చేస్తున్న ఎలుక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral videos) తెగ చక్కర్లు కొడుతోంది. భారీ వర్షం (heavy rain) పడడంతో రోడ్డుపై నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఓ బొరియ నుంచి బయటికొచ్చిన ఎలుకకు (rat).. ఉన్నట్టుండి శుచి, శుభ్రత గుర్తొస్తుంది. వర్షం పడుతున్న సమయంలో మనుషులు ఎలాగైతే ఎంజాయ్ చేస్తారో.. అచ్చం అలాగే ప్రవర్తించింది. అంతటితో ఆగకుండా పనిలో పనిగా శుభ్రంగా (rat bathing in the rain) స్నానం చేసింది. వర్షం నీటిని మొఖంపై పోసుకుని కడుక్కుంటుంది.

Tip Controversy: ఇంత లగ్జరీ ఇంట్లో ఉంటూ ఇంత చీప్‌గా టిప్ ఇస్తావా..? ఓ డెలివరీ బాయ్ మాటలకు విస్తుపోయిన మహిళ.. చివరకు..!

అలాగే తల, మిగతా శరీరాన్ని కూడా మనుషుల మాదిరే శుభ్రం చేసుకుంటుంది. తల మీద ఉన్న మురికి మొత్తం పోయే వరకూ స్నానం చేస్తూనే ఉంటుంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. ‘‘ఇది మనిషా.. ఎలుగా.. మరీ విచిత్రంగా ఉందే’’.. అని కొందరు, ‘‘ఎవరైనా దానికి సబ్బు ఇవ్వండి’’.. అని మరికొందరు, ‘‘ఇది క్లీన్ ఎలుక’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

TV Serials: టీవీ సీరియల్స్ క్రియేటివిటీ పీక్స్‌కు వెళ్లిపోయిందిగా.. స్కూటర్‌తోనే చంద్రుడిపైకి.. వ్యోమగాములు కనుక ఈ సీన్‌ను చూస్తే..!

Updated Date - 2023-07-06T21:54:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising