ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Reserve bank of india: బ్యాంక్ లాకర్ వినియోగించేవారికి తలనొప్పిగా మారిన ఆర్బీఐ కండీషన్స్

ABN, First Publish Date - 2023-02-28T11:13:34+05:30

ప్రస్తుత కాలంలో చాలా మంది తాము సంపాదించిన సొమ్మును ఇంట్లో దాచుకోవడం కంటే..బ్యాంక్ లాకర్(Bank Locker)లో దాచుకోవడానికి ఇంట్రస్ట్ ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ప్రస్తుత కాలంలో చాలా మంది తాము సంపాదించిన సొమ్మును ఇంట్లో దాచుకోవడం కంటే..బ్యాంక్ లాకర్(Bank Locker)లో దాచుకోవడానికి ఇంట్రస్ట్ చూపుతున్నారు. చాలా మంది బ్యాంక్ లాకర్‎లో ఆస్తి పత్రాలు, నగదు వంటి దాస్తారు. మరి కొందరు డబ్బు(money)ను కూడా దాచి పెడతారు. ఇక నుంచి కొత్త విధానం అమలులోకి వచ్చింది. దీని ప్రకారం బ్యాంక్ లాకర్‎లో నగదు పెట్టడానికి వీలులేదు. ఇందుకు సంబంధించి బ్యాంకుతో కొత్త అగ్రిమెంట్ (Agreement)చేసుకోవాలని కస్టమర్లకు సూచించింది ఆర్బీఐ(RBI). రూ.200 స్టాంపు పత్రాలపై నోటరీ చేయించి బ్యాంకు(Bank)లో ఇవ్వాలని స్పష్టం చేసింది. వాస్తవానికి ఈ కొత్త విధానికి సంబంధించిన గడువు జనవరి 1న ముగియగా.. ఇప్పుడు మళ్లీ పొడిగించింది ఆర్బీఐ. కొత్త రూల్‎కు సంబంధించి అగ్రిమెంట్ చేసుకోవడానికి ఆర్బీఐ డిసెంబర్ 31 వరకు అవకాశం ఇచ్చింది. గడువు ముగిసినా చాలా మంది కస్టమర్లు తమ తమ బ్యాంక్‎తో అగ్రిమెంట్ చేసుకోలేదు. దీంతో అగ్రిమెంట్ చేసుకోని వారి లాకర్లను బ్యాంకులు సీజ్ చేశాయి.

తాజాగా ఆర్బీఐ బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కొత్త రూల్స్‎కు సంబంధించి ఒప్పందాలు చేసుకుని వారికి మరో అవకాశం ఇవ్వాలని బ్యాంకులకు ఆదేశించింది. కొత్త ఒప్పందాలకు సబంధించి కీలక ప్రకటనలు చేసిన ఆర్బీఐ. బ్యాంకులకు మూడు దశల లక్ష్యాలను పెట్టింది. ఈ మూడు దశల్లోగా..కస్టమర్లందిరితో(customers) ఒప్పందాలు చేయించాలని స్పష్టం చేసింది. జూన్ 30లోపు 50 శాతం, సెప్టెంబర్ 30లోపు 75, డిసెంబర్ 31లో వందశాతం మంది వినియోగదారుల నుంచి ఒప్పందాలు పూర్తి చేయాలని తెలిపింది. ఈ గడువు తేదీకి సంబంధించిన వివరాలను వినియోగదారులందరికీ పంపాలని అన్ని బ్యాంకులను ఆదేశించింది ఆర్బీఐ.

ఆర్బీఐ కొత్త ఒప్పందం ప్రకారం లాకర్లలో నగదు దాచుకోవడానికి అవకాశం లేదు. లాకర్ కేటాయించే సమయంలోనే ఈ ఖండిషన్ కి సంబంధించి ఒప్పందాన్ని చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కొత్త ఒప్పందం ప్రకారం. లాకర్ వార్షిక నిర్వహణకు కొంత మొత్తం చెల్లించాల్సివుంటుంది. ఆ మొత్తాన్ని కస్టమర్లు ముందుగానే డిపాజిట్ చేయాల్సివుంటుంది. అయితే లాకర్లలో అక్రమ నగదు నిల్వలలను అరికట్టేందుకే ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈక్రమంలోనే లాకర్లలో ఏం పెట్టాలి..ఏమ్ పెట్టకూడదు వివరాలను స్పష్టం చేసింది. నగలు వంటి విలువైన వస్తువులు పెట్టుకోవచ్చు. ఆస్తి పత్రాలు, ఇతర పత్రాలను భద్రపరుచుకోవచ్చు. నగదు, కరెన్సీ నోట్లను లాకర్‎లో పెట్టకూడదు.

Updated Date - 2023-02-28T11:25:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!