SSMB28: మహేష్, త్రివిక్రమ్ సినిమా రికార్డు స్థాయిలో కొనుగోలు
ABN, First Publish Date - 2023-01-31T15:48:06+05:30
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Director Trivikram Srinivas), మహేష్ బాబు (Mahesh Babu) కాంబినేషన్ లో సినిమా షూటింగ్ మొదలయ్యి ఇంకా కొన్ని రోజులు కూడా కాలేదు, అప్పుడే ఈ సినిమా ఓ.టి.టి. హక్కుల (OTT Rights) కోసం నెట్ ఫ్లిక్స్ (Netflix) భారీగా డబ్బులు చెల్లిస్తోంది అని తెలిసింది.
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Director Trivikram Srinivas), మహేష్ బాబు (Mahesh Babu) కాంబినేషన్ లో సినిమా షూటింగ్ మొదలయ్యి ఇంకా కొన్ని రోజులు కూడా కాలేదు, అప్పుడే ఈ సినిమా ఓ.టి.టి. హక్కుల (OTT Rights) కోసం నెట్ ఫ్లిక్స్ (Netflix) భారీగా డబ్బులు చెల్లిస్తోంది అని తెలిసింది. ఒక సమాచారం ప్రకారం, ఈ చిత్ర నిర్మాతలకు ఆ ఓ.టి.టి. సుమారు 80 కోట్లు (80 crore) హక్కుల కోసం ఇస్తామని చెప్పారని, ఇది విని నిర్మాతలే ఆశ్చర్యపోయారని తెలిసింది. మహేష్ బాబు కి జోడీగా పూజ హెగ్డే (Pooja Hegde), శ్రీ లీల (Sreeleela) కథానాయికలుగా నటిస్తున్నారు.
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలకి చిన్ని తేర మీద గొప్ప క్రేజ్ వుంది. 'అతడు' (Athadu), 'ఖలేజా' (Khaleja), 'జల్సా', 'అత్తారింటికి దారేది' (Atharintiki Daredi), 'జులాయి' (Julayi) ఇంకా ఈమధ్య వచ్చిన 'ఆల వైకుంఠపురం లో' (Ala Vaikuntapuram Lo) ఒకటేమిటి త్రివిక్రమ్ సినిమాలని టీవీ లో విపరీతంగా చూస్తారు ప్రేక్షకులు. అదీ కాకుండా ఈమధ్య విడుదల అయిన 'ఆల వైకుంఠపురం లో' ఇటు థియేటర్ లోనూ అటు టీవీ లోనూ కూడా పెద్ద హిట్ అయింది. అందుకని త్రివిక్రమ్ సినిమాలకి అంత క్రేజ్ ఉండబట్టే నెట్ ఫ్లిక్స్ సంస్థ ఇంత ఆఫర్ చేసిందని పరిశ్రమలో ఒక టాక్ నడుస్తోంది.
అయితే ఈ డబ్బులు మొత్తం ఈ సినిమా దక్షిణ భారత భాషలు అన్నిటికీ కలిపి అని తెలిసింది. ఇది మహేష్ బాబు కెరీర్ లో అత్యుత్తమ డీల్ గా చెప్పుకోవచ్చు అని కూడా తెలిసింది. అలాగే ఈమధ్య కాలం లో ఏ తెలుగు సినిమాకి కూడా ఇంత భారీగా డబ్బులు ఇలా ఓ.టి.టి. హక్కుల కోసం ఎవరూ చెల్లించలేదని కూడా అనుకుంటున్నారు. రాజమౌళి (SS Rajamouli), సుకుమార్ (Sukumar) లాంటి దర్శకుల పేరు మీద సినిమాలు బాగా బిజినెస్ ఎలా చేసుకుంటాయో ఇప్పుడు దర్శకుడు త్రివిక్రమ్ కూడా అదే కోవలోకి చేరుకొని తనదయిన మార్కుతో మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు.
Updated Date - 2023-01-31T15:48:07+05:30 IST