ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

RRR: ఆస్కార్ కోసం అదిరిపోయే ప్రమోషన్స్!

ABN, First Publish Date - 2023-02-23T14:54:11+05:30

టాప్ డైరెక్టర్ ఎస్‌ఎస్.రాజమౌళి (SS. Rajamouli) తెరకెక్కించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (RRR). జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్ (Ram Charan) హీరోలుగా నటించారు. ఈ మూవీ వరల్డ్ వైడ్‌ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాప్ డైరెక్టర్ ఎస్‌ఎస్.రాజమౌళి (SS. Rajamouli) తెరకెక్కించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (RRR). జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్ (Ram Charan) హీరోలుగా నటించారు. ఈ మూవీ వరల్డ్ వైడ్‌ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. దాదాపుగా రూ.1200కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాకు గ్లోబల్ ఆడియన్స్ కూడా ఫిదా అయిపోయారు. ఫలితంగా అనేక ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’ సత్తా చాటింది. ఈ చిత్రం ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని కూడా కైవసం చేసుకుంది. ఆస్కార్ బరిలోను నిలిచింది. ‘నాటు నాటు’ (Naatu Naatu) బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అకాడమీ అవార్డ్ కోసం పోటీపడుతుంది.

ఆస్కార్ అవార్డ్స్‌ను మార్చి 12న ప్రదానం చేయనున్నారు. పురస్కారాలు సమీపిస్తుండటంతో ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర బృందం ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. అందులో భాగంగా ‘ఆర్ఆర్ఆర్’ హీరో రామ్ చరణ్ పాపులర్ షో ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ లో పాల్గొన్నారు. అనేక ఆసక్తికర కబుర్లను ప్రేక్షకులతో పంచుకున్నారు. మేకర్స్ కొత్త ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. అమెరికాలోని థియేటర్స్‌లో సినిమాను రి రిలీజ్ చేయనున్నారు. 200 థియేటర్స్‌లో చిత్రాన్ని ప్రదర్శించనున్నట్టు చెప్పారు. మార్చి 3 నుంచి మూవీ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్‌ఎమ్. కీరవాణి (MM Keeravaani) కూడా ప్రమోషన్స్‌లో అతి త్వరలోనే చేరుతారని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి. మీట్ అండ్ గ్రీట్‌ షోస్‌లో చిత్ర బృందం అభిమానులతో కూడా ముచ్చటించనున్నట్టు సమాచారం అందుతుంది. ‘ఆర్ఆర్ఆర్’ ను 1920ల బ్యాక్‌డ్రాప్‌లో ఫిక్షనల్ స్టోరీగా తెరకెక్కించారు. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌ల స్ఫూర్తితో రూపొందించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగణ్, సముద్ర ఖని, ఒలివియా మోరిస్, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Ranbir Kapoor: బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకునే అర్హత నాకు లేదు.. ‘పుష్ప’ లో అల్లు అర్జున్ అద్భుతంగా..

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Vishal: భారీ ప్రమాదం.. కొంచముంటే విశాల్ ప్రాణాలు పోయేవి.. వీడియో వైరల్

Nani: నెపోటిజానికి కారణం ప్రేక్షకులే..!

Updated Date - 2023-02-23T14:57:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising