ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vande Bharat: మూత్రం పోసేందుకు వందేభారత్ ట్రైన్ ఎక్కిన వ్యక్తి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ABN, First Publish Date - 2023-07-20T15:47:28+05:30

ఓ వ్యక్తి మూత్రం పోసేందుకు వందేభారత్ ట్రైన్ ఎక్కాడు. చూస్తుండగానే ఆ ట్రైన్ బయలుదేరడం, వేగం పుంజుకోవడం క్షణాల్లో జరిగిపోయాయి. ఆ తర్వాత సాయం చేయాలంటూ ముగ్గురు టికెట్ కలెక్టర్లు, నలుగురు పోలీసుల సాయం కోరినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో దాదాపు ఆరు వేల రూపాయల నష్టం జరిగింది.

భోపాల్: కొన్ని సందర్భాల్లో ఎదురయ్యే అనూహ్య పరిస్థితులు దేవుడా.. అనిపిస్తుంటాయి. లేనిపోని చిక్కుల్లోకి నెడుతుంటాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన అబ్దుల్ ఖాదీర్ అనే వ్యక్తికి కూడా ఈ తరహా అనుభూతే ఎదురైంది. అర్జెన్సీగా మూత్రం పోసేందుకు వందే భారత్ ట్రైన్‌ (Vande Bharat train) ఎక్కిన అతడికి నివ్వెరపోయే పరిణామాలు ఎదురయ్యాయి. వెళ్లిన పని కానిచ్చేసి వచ్చిలోగా వందే భారత్ ట్రైన్ డోర్స్ లాక్ అయ్యాయి. చూస్తుండగానే బయలుదేరడం, వేగం పుంజుకోవడం క్షణాల్లో జరిగిపోయాయి. ఆ తర్వాత సాయం చేయాలంటూ ముగ్గురు టికెట్ కలెక్టర్లు, నలుగురు పోలీసుల సాయం కోరినా ప్రయోజనం లేకుండా పోయింది. డ్రైవర్ మాత్రమే ట్రైన్ డోర్లు ఓపెన్ చేయగలరంటూ వారు సమాధానమిచ్చారు. దీంతో కంగారు కంగారుగా డ్రైవర్ దగ్గరకు వెళ్తున్న అబ్ధుల్‌ను పోలీసులు అడ్డుకున్నారు.

ఇక అబ్ధుల్ టికెట్ లేకుండా ట్రైన్ జర్నీ చేసినందుకుగానూ అతడు రూ.1,020 జరిమానా చెల్లించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఉజ్జయిన్‌ స్టేషన్‌లో దిగి అక్కడి నుంచి బస్సు ద్వారా భోపాల్ వెళ్లడానికి రూ.750 ఖర్చుపెట్టాల్సి వచ్చింది. మరోవైపు భర్త అబ్ధుల్ వందేభారత్ ట్రైన్‌లో చిక్కుకోవడంతో ఆందోళనకు గురైన భార్య అతడు తిరిగొచ్చేవరకు రైల్వే స్టేషన్‌లోనే ఉండాలని నిర్ణయించి అక్కడే ఉంది. సింగ్రౌలి వెళ్లాల్సిన దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ కూడా ఎక్కలేదు. దీంతో రూ.4000 విలువైన టికెట్లు వృథాగా పోయాయి. మొత్తంగా అర్జెన్సీ మూత్రం కారణంగా అబ్ధుల్‌కి ఏకంగా రూ.6000 వృథా ఖర్చయ్యింది. జూలై 15న ఈ ఘటన జరిగింది.


అబ్ధుల్ తన భార్య, 8 ఏళ్ల కొడుకుతో కలిసి ఈ నెల 15న హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్‌లోని తన సొంతూరు సింగ్రౌలి బయలుదేరాడు. షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్‌లో బయలుదేరి సాయంత్రం 5.20 గంటలకు భోపాల్ చేరుకున్నారు. అక్కడి నుంచి రాత్రి 8.55 గంటలకు సింగ్రౌలి వెళ్లాల్సిన ట్రైన్ ఎక్కాల్సి ఉండడంతో ప్లాట్‌ఫామ్‌పైనే వేచివున్నారు. ఆ సమయంలో ఇండోర్ వెళ్లాల్సిన వందేభారత్ ట్రైన్ పట్టాలపై సిద్ధంగా ఉంది. ఈ ట్రైన్‌నే అబ్ధుల్ ఖాదీర్ ఎక్కాడు.

ఈ ఘటనపై అబ్ధుల్ స్పందిస్తూ... వందేభారత్‌ ట్రైన్‌లో ఎమర్జెన్సీ సిస్టమ్ లేకపోవడంతో తన కుటుంబం మానసిక హింసకు గురయ్యిందన్నాడు. ఈ ఘటన ఎమర్జెన్సీ వ్యవస్థలో లోపాన్ని ఎత్తిచూపుతుందని భావిస్తున్నట్టు ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక భోపాల్ రైల్వే డివిజన్ పీఆర్‌వో సుబేదార్ సింగ్ స్పందిస్తూ.. వందేభారత్ ట్రైన్ బయలుదేరడానికి ముందు అనౌన్స్‌మెంట్ కూడా చేశారని వెల్లడించారు. ప్రమాదాలు జరగకుండా డోర్లు ఓపెన్, క్లోజింగ్ సమయాల్లో జాగ్రత్తగా వ్యహరిస్తారని చెప్పాడు. అయితే ఒక్కసారి ట్రైన్ బయలుదేరాక ఆపడమనేది ఉన్నతాధికారుల ఆదేశాలు ఉండాల్సిందేనని చెప్పారు. కాగా అబ్ధుల్ ఖాదీర్‌కు హైదరాబాద్‌లో ఒకటి, సింగ్రౌలిలో ఒకటి డ్రై ఫ్రూట్స్ షాపులను నిర్వహిస్తున్నాడు.

Updated Date - 2023-07-20T15:47:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising