SBI new rule: ఎస్‌బీఐ బిగ్‌న్యూస్... మారిపోనున్న కీలక రూల్... ఏ తేదీ నుంచి అంటే...
ABN, First Publish Date - 2023-05-28T20:23:03+05:30
కోట్లాది మంది ఎస్‌బీఐ ఖాతాదారులందరికీ (SBI Account holders) జూన్ 30 చాలా ముఖ్యమైన తేదీ. ఎందుకంటే ఈ తేదీ నుంచి బ్యాంక్ లాకర్‌కు సంబంధించిన ఒక రూల్ మారబోతోంది. జూన్ 30లోగా...
దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ ఎస్‌బీఐ (SBI). అత్యధిక బ్రాంచులతో దేశవ్యాప్తంగా కస్టమర్లకు విశేష సేవలు అందిస్తోంది. అత్యధిక బ్రాంచుల ద్వారా పెద్ద సంఖ్యలో ఖాతాదారులకు చేరువైంది. కాబట్టి ఈ బ్యాంక్‌కు సంబంధించిన రూల్స్‌లో ఎలాంటి మార్పు వచ్చినా కస్టమర్లు అవగాహనతో ఉండడం చాలా ముఖ్యం. కోట్లాది మంది ఎస్‌బీఐ ఖాతాదారులందరికీ (SBI Account holders) జూన్ 30 చాలా ముఖ్యమైన తేదీ. ఎందుకంటే ఈ తేదీ నుంచి బ్యాంక్ లాకర్‌కు సంబంధించిన ఒక రూల్ మారబోతోంది. జూన్ 30లోగా లాకర్ అగ్రిమెంట్‌ను (Locker agreement) సవరించుకొని సంతకం చేయాలంటూ తన కస్టమర్లకు ఎస్‌బీఐ అడ్వైజరీ జారీ చేసింది. కోట్లాదిమంది కస్టమర్లపై ప్రభావం చూపనుందని ఆఫీషియల్‌గా ట్వీట్ చేసింది. లాకర్ రూల్స్ మార్పునకు సంబంధించి గత కొన్ని రోజులుగా సమాచారమిస్తున్నట్టు పేర్కొంది. వీలైనంత త్వరగా అగ్రిమెంట్‌పై సంతకం చేయాలని ఖాతాదారులను కోరింది. తమ బ్రాంచ్‌ను సంప్రదించి ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపింది. ఇప్పటికే సంతకం చేసినప్పటికీ సప్లిమెంటరీ అగ్రిమెంట్ చేయాల్సి ఉంటుందని సూచించింది.
మరోవైపు.. బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా గడువు తేదీలోగా సవరించిన లాకర్ అగ్రిమెంట్‌పై సంతకం చేయాలని కస్టమర్లను కోరుతోంది. కాగా 23 జనవరి 2023న కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ కీలక ప్రకటన జారీ చేసింది. సవరించిన లాకర్ రూల్స్‌కు సంబంధించి కస్టమర్లకు సమాచారం ఇవ్వాలని బ్యాంకులను ఆదేశించింది. జూన్ 30లోగా 50 శాతం, సెప్టెంబర్ 30లోగా 75 శాతం కస్టమర్లను సవరించిన లాకర్ అగ్రిమెంట్‌పై సంతకం చేయించాలని స్పష్టం చేసింది. కాగా సవరించిన రూల్స్ ప్రకారం.. దొంగతనం, దోపిడీ, బ్యాంక్ లేదా ఉద్యోగుల నిర్లక్ష్యం కారణంగా లాకర్‌లోని సొమ్ము పోతే బ్యాంకులు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
Updated Date - 2023-05-28T21:04:03+05:30 IST