8th Continent: 375 ఏళ్లక్రితం కనిపించకుండాపోయిన 8వ ఖండాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు..!
ABN, First Publish Date - 2023-09-27T12:22:31+05:30
ప్రస్తుతమున్న 7 ఖండాలే కాకుండా మరో ఖండం కూడా ఉందా?.. అనే సందేహాలకు ఔననే సమాధానమిస్తున్నారు భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు (Geoscientists). దాదాపు 375 సంవత్సరాల నుంచి కనిపించకుండా దాగివున్న 8వ ఖండాన్ని గుర్తించామని చెబుతున్నారు. ఈ మేరకు జియాలజిస్టులు, సెస్మాలజిస్టులతో కూడిన చిన్న బృందం కొత్త ఖండం ‘జీలాండియా’ (Zealandia) లేదా ‘టె రీ-ఆ-మౌ’ (Riu-a-Maui) మ్యాప్‌ను రూపొందించారు.
ప్రస్తుతమున్న 7 ఖండాలే కాకుండా మరో ఖండం కూడా ఉందా?.. అనే సందేహాలకు ఔననే సమాధానమిస్తున్నారు భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు (Geoscientists). దాదాపు 375 సంవత్సరాల నుంచి కనిపించకుండా దాగివున్న 8వ ఖండాన్ని గుర్తించామని చెబుతున్నారు. ఈ మేరకు జియాలజిస్టులు, సెస్మాలజిస్టులతో కూడిన చిన్న బృందం కొత్త ఖండం ‘జీలాండియా’ (Zealandia) లేదా ‘టె రీ-ఆ-మౌ’ (Riu-a-Maui) మ్యాప్‌ను రూపొందించారని ఫిజై.ఓఆర్జీ (Phys.org) రిపోర్ట్ వెల్లడించింది. సముద్ర భూగర్భం నుంచి సేకరించిన రాతి నమూనాల ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ 8వ ఖండాన్ని గుర్తించినట్టు వెల్లడించింది. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు ‘టెక్టోనిక్స్’ (Tectonics) జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
కాగా జీలాండియా విస్తీర్ణం 1.89 మిలియన్ చదరపు మైళ్ల విశాలంగా ఉందని, మడగాస్కర్ కంటే ఆరు రెట్లు ఎక్కువని బీబీసీ రిపోర్ట్ పేర్కొంది. నిజానికి 8 ఖండాలు ఉన్నాయని అధ్యయనం నిర్వహించిన శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. కొత్త ఖండం చేరికతో ఖండాలకు సంబంధించిన రికార్డులు మారతాయని అంచనా వేసింది. ఖండాల విషయంలో ప్రపంచంలో అతి చిన్న, అతి సన్న, అతి పిన్న వయసుకు సంబంధించిన రికార్డులు మారతాయని వెల్లడించింది. ఇక కొత్త ఖండం విస్తీర్ణంలో దాదాపు 94 శాతం నీటి అడుగు భాగానే ఉంది. న్యూజిలాండ్ మాదిరిగా కేవలం కొన్ని ద్వీపాలు మాత్రమే పైకి కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదిలావుండగా తెలియని విషయాన్ని గుర్తించడానికి కొంతసమయం పడుతుందని జీలాండియాను కనుగొన్న శాస్త్రవేత్తల బృందంలో ఒకరైన న్యూజిలాండ్ క్రౌన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ జీఎన్‌ఎస్ సైన్స్‌లోని జియాలజిస్ట్ ఆండీ తుల్లోచ్ అన్నారని బీబీసీ రిపోర్ట్ వెల్లడించింది.
ఇక జీలాండియా అధ్యయనం చేయడం ఎప్పుడూ సంక్లిష్టమేనని శాస్త్రవేత్తలు చెప్పారు. సముద్రపు అడుగుభాగం నుంచి సేకరించిన రాళ్లు, అవక్షేప నమూనాలను అధ్యయనం చేస్తున్నామన్నారు. వీటిలో ఎక్కువ భాగం డ్రిల్లింగ్ సైట్‌ల నుంచి వచ్చాయని తెలిపారు. ఇక మరికొన్ని ఈ ప్రాంతంలోని ద్వీపాల తీరాల నుంచి సేకరించామని వివరించారు. రాతి నమూనాల అధ్యయనంలో పశ్చిమ అంటార్కిటికాలో భౌగోళిక నమూనాలు కనిపించాయని Phys.org రిపోర్ట్ పేర్కొంది. దీన్నిబట్టి న్యూజిలాండ్ పశ్చిమ తీరం క్యాంప్‌బెల్ పీఠభూమికి సమీపంలో సబ్‌డక్షన్ జోన్ ఉండే అవకాశం ఉందని వివరించింది. ఆ ప్రాంతంలో అయస్కాంత క్రమరాహిత్యాలను గుర్తించలేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇక కొత్తగా రూపొందించిన మ్యాప్ ప్రకారం.. జీలాండియా ఖండంలోని భూఅయస్కాంత రేఖ మాత్రమే కాకుండా కాకుండా ఇతర ప్రధాన భౌగోళిక లక్షణాలను కూడా కలిగివుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదిలావుండగా జీలాండియా వాస్తవానికి పురాతన సూపర్ ఖండమైన గోండ్వానాలో భాగంగా ఉందని అధ్యయనకారులు చెబుతున్నారు. గోండ్వానా సుమారు 550 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిందని శాస్త్రవేత్తలు గుర్తుచేశారు.
Updated Date - 2023-09-27T12:25:04+05:30 IST