Home » Earth
భూగ్రహాన్ని మరో అస్టెరాయిడ్ భయపెడుతోంది. భయోత్పాతాలు సృష్టిస్తాడని ఈజిప్ట్ ప్రజలు భావించే ‘అపోఫిస్’ అనే దేవుడు పేరును ఈ ఆస్టెరాయిడ్‌కుపెట్టారు. ఈ గ్రహశకలం ఏప్రిల్ 13, 2029న భూమికి అత్యంత సమీపం నుంచి ప్రయాణించనుందని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కాగా ఈ అస్టెరాయిడ్‌ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అత్యంత నిశితంగా పరిశీలిస్తోంది.
ఫ్రాన్స్‌తో కలిసి చైనా లాంగ్ మార్చ్ 2 సీ రాకెట్‌ను శనివారం ప్రయోగించింది. నింగిలోకి వెళ్లిన కాసేపటికి రాకెట్‌లోని కొంత భాగం పేలింది. నివాస ప్రాంతానికి సమీపంలో పడటం ఆందోళన కలిగించింది. రాకెట్‌లోని కొంత భాగం భూమి మీద పడే సమయంలో జనం భయంతో పరుగు తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది.
ప్రస్తుతమున్న 7 ఖండాలే కాకుండా మరో ఖండం కూడా ఉందా?.. అనే సందేహాలకు ఔననే సమాధానమిస్తున్నారు భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు (Geoscientists). దాదాపు 375 సంవత్సరాల నుంచి కనిపించకుండా దాగివున్న 8వ ఖండాన్ని గుర్తించామని చెబుతున్నారు. ఈ మేరకు జియాలజిస్టులు, సెస్మాలజిస్టులతో కూడిన చిన్న బృందం కొత్త ఖండం ‘జీలాండియా’ (Zealandia) లేదా ‘టె రీ-ఆ-మౌ’ (Riu-a-Maui) మ్యాప్‌ను రూపొందించారు.