iPhone15: ఐఫోన్15 సిరీస్ ఫోన్ల కోసం భారత్‌లో పలుచోట్ల బారులు.. స్టోర్లు తెరవక ముందే క్యూలు..
ABN, First Publish Date - 2023-09-22T10:58:57+05:30
ఎంతగానో ఎదురుచూస్తున్న యాపిల్ ఐఫోన్ 15 (iPhone15) నేటి (శుక్రవారం) భారతీయులకు అందుబాటులోకి రానుంది. భారత్‌తోపాటు పలు దేశాల్లో విక్రయానికి ఈ ఫోన్లు లభ్యమవుతాయి. ఆస్ట్రేలియా, హాంకాంగ్, చైనాతోపాటు మొత్తం 40 దేశాల్లో ఈ సరికొత్త ఫోన్లు మొదటి దశలో విక్రయానికి అందుబాటులో ఉంటాయి. కాగా యాపిల్ కంపెనీ ఇటివలే ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను ఆవిష్కరించిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: ఎంతగానో ఎదురుచూస్తున్న యాపిల్ ఐఫోన్ 15 (iPhone15) నేటి (శుక్రవారం) భారతీయులకు అందుబాటులోకి రానుంది. భారత్‌తోపాటు పలు దేశాల్లో విక్రయానికి ఈ ఫోన్లు లభ్యమవుతాయి. ఆస్ట్రేలియా, హాంకాంగ్, చైనాతోపాటు మొత్తం 40 దేశాల్లో ఈ సరికొత్త ఫోన్లు మొదటి దశలో విక్రయానికి అందుబాటులో ఉంటాయి. కాగా యాపిల్ కంపెనీ ఇటివలే ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ పేరిట ఫోన్లను లాంచ్ చేసింది. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ స్టోరేజీ కెపాసిటీలు 128జీబీ, 256జీబీగా ఉన్నాయి. ఇక ఈ ఫోన్లు మొత్తం 5 రంగులలో లభిస్తున్నాయి. పింక్, పసుపు, ఆకుపచ్చ, నీలం, నలుపు రంగుల్లో లభ్యమవుతాయని కంపెనీ వెల్లడించింది.
స్టోర్ల ముందు క్యూ..
ఐఫోన్ కొత్త సిరీస్ ఫోన్లు మార్కెట్లోకి విడుదలైనప్పుడు ఉంటే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టోర్లు ఓపెన్ చేయకముందే బారులు తీరి ఉండే క్యూలు అందరికీ గుర్తొస్తూనే ఉంటాయి. ఈ ఏడాది కూడా అలాంటి సీన్లు తలపిస్తున్నాయి. ఈ రోజు (శుక్రవారం) నుంచి భారత్‌లో విక్రయాలు ప్రారంభమవుతాయనే సమాచారం నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు స్టోర్ల ముందు క్యూలైన్లు కనిపించాయి. ముంబై, ఢిల్లీలోన యాపిల్ బీకేసీ, సాకేత్ స్టోర్ల ముందు ఐఫోన్ ప్రియులు క్యూలైన్లలో కనిపించారు. ఒక స్టోర్ వద్దైతే ఉదయమే కనీసం 100 మంది క్యూకట్టినట్టు తెలుస్తోంది. సమయం గడుస్తున్నా కొద్దీ ఈ సంఖ్య పెరుగుతోందని రిపోర్టులు వస్తున్నాయి.
ధరలు ఇలా ఉన్నాయి...
128జీబీ బేస్ స్టోరేజ్‌తో ఐఫోన్ (iPhone 15) ధర రూ.79,900 నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది. అయితే ఐఫోన్ (iPhone 15 Plus) రూ.89,900 నుంచి ఐఫోన్ 15 ప్రో (iPhone 15 Pro 128GB) రూ.134,900 నుంచి ధరలు ఆరంభమవుతాయి. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ (iPhone 15 Pro Max 256GB) ధర రూ.159,900 నుంచి అందుబాటులో ఉంటుంది.
డిమాండ్ ఫుల్.. స్టాక్ నిల్..
ఆన్‌లైన్ విక్రయాలను బట్టి చూస్తే యాపిల్ ఐఫోన్15 మోడల్ ఫోన్లకు వినియోగదారుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోందనేది స్పష్టమవుతోంది. ముఖ్యంగా హైఎండ్ మోడల్ ఫోన్లకు మరింత గిరాకీ ఏర్పడింది. కొన్ని దేశాల్లో ఆర్డర్లు పెట్టినా నవంబర్ మధ్యవరకు డెలివరీలు అందే అవకాశం కనిపించడం లేదు. స్టోర్లలోని స్టాక్ కూడా త్వరగానే విక్రయమైందని తెలుస్తోంది.
Updated Date - 2023-09-22T10:58:57+05:30 IST