Viral News: జీవితంలో అసలు పెళ్లే చేసుకోదట.. కానీ ఓ బిడ్డకు తల్లి అవాలని మాత్రం ఉందట.. చివరకు ఈ యువతి ఏం చేసిందంటే..!
ABN, First Publish Date - 2023-05-03T10:00:46+05:30
ఆమె పేరు సారా మంగత్ (Sarah Mangat). కెనడాలోని టొరంటో నివాసి.
ఇంటర్నెట్ డెస్క్: ఆమె పేరు సారా మంగత్ (Sarah Mangat). కెనడాలోని టొరంటో నివాసి. సారా ఎనిమిదేళ్లు సరియైన భాగస్వామి కోసం ఎదురుచూసింది. తాను కోరుకున్నవాడు దొరకకపోవడంతో జీవితంలో అసలు పెళ్లే చేసుకోవద్దనుకుంది. కానీ ఓ బిడ్డకు తల్లి అవాలని మాత్రం ఉంది. అలా జీవితంలో స్థిరపడిపోవాలని నిర్ణయించుకున్న ఆమె కీలక నిర్ణయమే తీసుకుంది. పెళ్లి చేసుకోకుండానే తల్లి కావాలనే నిర్ణయించుకుంది. సింగిల్‌గానే తల్లి కావాలని నిర్ణయించుకున్న ఆమె.. స్మెర్మ్ డోనర్ (Sperm Donor) కోసం వెతికింది. ఈ క్రమంలో ఫేస్‌బుక్‌లో ఆమెకు ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతడితో కొంతకాలం చాట్ చేసింది. అతడు కెనడియన్ స్పెర్మ్ డొనర్స్ ఫేస్‌బుక్ కమ్యూనిటీకి చెందిన వాడు కావడంతో సారా పని ఇంకా సులువై పోయింది.
అతడి నుంచి స్పెర్మ్ తీసుకుని గర్భం దాల్చింది. ఇక మెడికల్ ప్రాసెస్ కోసం సారా ఏకంగా రూ.5లక్షలు వెచ్చించింది. గతేడాది ఏప్రిల్‌లో ఏడు నెలలకే ఆమె కవలలకు జన్మనిచ్చింది. అయితే, ఆమె డెలివరీ ముందుగానే (Premature) జరగడంతో తల్లీబిడ్డలు ఆ తర్వాత కొన్ని వారాలు ఆస్పత్రిలోనే గడపాల్సి వచ్చింది. ప్రస్తుతానికి సారా కుమార్తెలు ఇద్దరూ ఒక ఏడాది వయసు గలవారు. వారిద్దరూ చాలా ఆరోగ్యంగా ఉన్నారు. వారి పేర్లు ఎలోరా, అడిసన్ అని ఆమె చెప్పింది. అలాగే సారా తరచుగా తన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది. ఆమె గర్భం దాల్చినప్పటి నుంచి తల్లి అయ్యే వరకు సాగిన ప్రయాణాన్ని కూడా ఫొటోల ద్వారా చూపించింది.
Crime News: ఆ తల్లి చేసిన పొరపాటే.. 11 ఏళ్ల కూతురి పాలిటి శాపమయింది.. 40 ఏళ్ల వ్యక్తితో ఆ బాలిక పెళ్లి జరగడం వెనుక..!
సారా తన జీవిత ప్రయాణం గురించి మాట్లాడుతూ.. "నేను ప్రతి డేటింగ్ యాప్‌లో భాగస్వామిని వెతకడానికి ప్రయత్నించాను. కానీ, నేను కోరుకున్నవాడు దొరకలేదు. అలా ఎనిమిదేళ్లు గడిచాయి. ఇలాంటి పరిస్థితుల్లో జీవితంలో సరైన వ్యక్తి వస్తాడని ఇంకెంత కాలం ఎదురుచూడలేము అనిపించింది. దాంతో ఒంటరి తల్లి కావాలని నిర్ణయించుకున్నాను. అయితే, మొదటి నుంచి అలాంటి ఉద్దేశం లేదు. ఆ తర్వాత అంతా అదే జరిగిపోయింది" అని చెప్పుకొచ్చింది.
Updated Date - 2023-05-03T10:00:46+05:30 IST