ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నా భర్త చాలా మంచోడు.. బ్రతకాలని లేక నేనే చచ్చిపోతున్నా.. అంటూ ఇంట్లో గోడపై రాతలు.. పోలీసులకు మరింత డౌట్.. చివరకు..!

ABN, First Publish Date - 2023-02-02T17:10:19+05:30

కొందరు పైకి అమాయకంగా కనిపించినా.. వారి చేష్టలు మాత్రం అత్యంత కిరాతకంగా ఉంటాయి. ఎంత పెద్ద నేరాలు చేసినా.. ఏమీ తెలీనట్లు ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి కేసుల్లో కొన్నిసార్లు పోలీసులను కూడా తప్పుదారి పట్టిస్తుంటారు. ఛత్తీస్‌గఢ్‌లో ..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొందరు పైకి అమాయకంగా కనిపించినా.. వారి చేష్టలు మాత్రం అత్యంత కిరాతకంగా ఉంటాయి. ఎంత పెద్ద నేరాలు చేసినా.. ఏమీ తెలీనట్లు ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి కేసుల్లో కొన్నిసార్లు పోలీసులను కూడా తప్పుదారి పట్టిస్తుంటారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇలాంటి కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. ‘‘నా భర్త చాలా మంచోడు.. బ్రతకాలని లేక నేనే చచ్చిపోతున్నా’’.. అని గోడపై రాసి ఉంది. పోలీసులకు అనుమానం వచ్చి విచారించగా.. షాకింగ్ వాస్తవం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) కోర్బా జిల్లా కుస్ముండాలోని బైరోటల్ వార్డుకు చెందిన సుమిత్ శ్రీవాస్.. భార్య జామున శ్రీవాస్(25)తో కలిసి నివాసం ఉంటున్నాడు. వీరికి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు (couple) రెండు, మూడేళ్ల వయసున్న కుమార్తెలు ఉన్నారు. మొన్నటిదాకా వీరి మధ్య ఎలాంటి గొడవలూ లేవు. అయితే ఇటీవల సుమిత్.. మద్యానికి బానిస (Alcoholic) అయ్యాడు. దీంతో దంపతుల మధ్య గొడవలు (quarrels) మొదలయ్యాయి. రోజూ ఇదే విషయమై గొడవలు జరుగుతున్నా.. సుమిత్ ప్రవర్తనలో మాత్రం ఎలాంటి మార్పూ రాలేదు. మంగళవారం రాత్రి మళ్లీ ఇద్దరూ గొడవపడ్డారు. అప్పటికే తీవ్రం కోపంలో ఉన్న సుమిత్.. భార్యను గొంతు నులిమి హత్య చేశాడు.

మంగళ హారతులతో వధువుకు అత్తారింట్లోకి స్వాగతం.. సడన్‌గా లోపల గదిలో నుంచి అరుపులు, కేకలు.. కంగారుగా వెళ్లి చూడగా...

కేసు తన మీదకు రాకుండా ఉండేందుకు.. ‘‘నా భర్త చాలా మంచోడు.. బ్రతకాలని లేక నేనే చచ్చిపోతున్నా’’.. అంటూ గోడపై రాసి, ఏమీ ఎరుగనట్లు నిద్రపోయాడు. ఉదయం లేచి తన భార్య ఆత్మహత్య చేసుకుందంటూ ఏడుపు నటించాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని విచారించారు. చుట్టు పక్కల వారిని విచారించారు. కొద్ది రోజులుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్న విషయం వారి దృష్టికి వచ్చింది. అయితే విచారణలో సుమిత్.. పోలీసులను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించాడు. చివరకు వారి స్టైల్లో విచారించగా.. నేరం అంగీకరించాడు. నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.

ఎంగేజ్మెంట్ రోజే ఓ యువకుడికి ఊహించని షాక్.. సడన్‌గా ఇంటి ముందు ప్రేయసి ఎంట్రీ.. చివరకు..!

Updated Date - 2023-02-02T17:10:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising