Shocking: ఎక్కువగా చదివితే పిచ్చోళ్లవుతారని పెద్దలు అనేది ఇందుకేనేమో.. ఓ జడ్జికి ఉరిశిక్ష విధించండంటూ హైకోర్టుకెళ్తే..!
ABN, First Publish Date - 2023-09-08T17:20:29+05:30
ఓ వ్యక్తి కోర్టులో కేసు వేసి దాన్ని పరిష్కరించాలని కోరాడు. అయితే జడ్జి ఆ కేసును తిరస్కరించాడు. దీంతో ఆ జడ్జినే ఉరితీయాలి అంటూ అతను ఏకంగా హైకోర్టుకు వెళ్లాడు.
బాగా చదువుకున్నవారిని గొప్పవారని, వారికి విషయ సమాచారం ప్రపంచ జ్ఞానం ఎక్కువగా ఉంటుందని అంటుంటారు. ఎప్పుడూ చదువులో మునిగి తేలుతూ ఉండేవారిని 'అంతగా చదువుకోకురా పిచ్చోడైపోతావ్' అని కొందరు సరదాగా అంటుంటారు. ఈ మాట ఓ వ్యక్తికి అక్షరాలా అతికినట్టు సరిపోతుంది. ఓ వ్యక్తి కోర్టులో కేసు వేసి దాన్ని పరిష్కరించాలని కోరాడు. అయితే జడ్జి ఆ కేసును తిరస్కరించాడు. దీంతో ఆ జడ్జినే ఉరితీయాలి అంటూ అతను ఏకంగా హైకోర్టుకు వెళ్లాడు. ఆ తరువాత జరిగిన పరిణామాలు చాలా షాకింగ్ గా ఉన్నాయి. అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్న ఈ సంఘటనకు సంబంధించి పూర్తీవివరాల్లోకి వెళితే..
కోర్టు కేసుకు సంబంధించి ఓ వింత సంఘటన మెట్రో నగరం ఢిల్లీ లో (Delhi)చోటు చేసుకుంది. నరేష్ శర్మ అనే వ్యక్తి ఐఐటీయన్ గా పనిచేస్తున్నాడు. స్వాతంత్ర్యం వచ్చినప్పటినుండి అధికారంలో ఉన్న ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వాలు చేసిన అవినీతిపై విచారణ చేసి ఆ పార్టీలు, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అతను ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ ను సింగల్ బెంచ్ న్యాయవాది స్వర్ణకాంత శర్మ తిరస్కరించారు. దీంతో నరేష్ శర్మ హైకోర్టులోనే మళ్లీ ఆ కేసుపై అప్పీలు చేశాడు. తన పిటిషన్ ను తిరస్కరించిన న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ మీద దేశద్రోహం కేసు నమోదు చేయాలని, అతనికి మరణ శిక్ష విధించాలని హైకోర్టు పిటిషన్ లో పొందుపరిచాడు. అవినీతి రుజువైన అధికారులను బుల్లెట్లతో కాల్చి చంపాలని కోరాడు. అదే విధంగా తను వేసిన పిటిషన్ ను న్యాయమూర్తి తిరస్కరించడం అంటే తనను అవమానించడమే అని, అది పరువు నష్టం దావా కిందకు కూడా వస్తుందని చెప్పాడు. ఇవన్నీ హైకోర్టు(High court)లో వేసిన అప్పీలు లో పొందుపరిచాడు.
Viral News: కామన్ మ్యాన్ ఖాతాలోకి రాత్రికి రాత్రే రూ.200 కోట్లు.. ఊళ్లో అందరికీ మెసేజ్ చూపించి మరీ ఏం చేశారంటే..!
అయితే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ సంజీవ్ లతో కూడిన డివిజన్ బెంచ్ నరేష్ శర్మ అప్పీల్ ను విచారించింది. అప్పీల్ లో సింగిల్ బెంచ్ న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మపై, ఇంకా సుప్రీం కోర్టు న్యాయమూర్తులపై కూడా కల్పిత పిచ్చి ఆరోపణలు చేశారని గ్రహించి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఇలాంటి ఆరోపణలు కోర్టు పరువు తీయడానికే దోహదం చేస్తాయని సింగిల్ బెంచ్ న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ కూడా పేర్కొన్నారు. అనంతరం ఇలాంటి పిటిషన్ దాఖలు చేసినందుకు నరేష్ శర్మ పై క్రిమినల్ ధిక్కార చర్యలు ఎందుకు తీసుకోకూడదు? అని షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఇప్పుడు రోస్టర్ బెంచ్ ఈ విషయాన్ని సెప్టెంబర్ 18న విచారించనుంది.
Stomach Pain: ఎన్ని మాత్రలు వేసినా కడుపునొప్పి తగ్గట్లేదంటూ.. 13 ఏళ్ల కూతుర్ని ఆస్పత్రికి తెచ్చిందో తల్లి.. టెస్టులు చేసి చూస్తే..!
Updated Date - 2023-09-08T17:29:08+05:30 IST