Shocking Video: చెవిలో నొప్పిగా ఉంది.. ఏమయిందో చూడమని చెప్పిందో తల్లి.. సరేనని ఆ కూతురు టార్చ్‌లైట్ వేసి మరీ చూస్తే..
ABN, First Publish Date - 2023-03-06T19:09:01+05:30
తల్లి చెవిలోకి టార్చ్ లైట్ వేసి చూసిన కూతురు ఒక్కసారిగా గావుకేక పెట్టింది. భయంతో వణికిపోయింది.
ఎప్పుడూ లేనిది ఉన్నట్టుండి చెవి నొప్పి ఏమిటో అర్థం కాలేదు ఆమెకు. చలిగాలికి చెవి నొప్పి వచ్చిందేమో తగ్గిపోతుందిలే అనుకుంది మొదట. కానీ ఆ నొప్పి పెరుగుతోంది తప్పితే ఎంతకూ తగ్గలేదు. చెవిలో ఏదైనా దూరిందేమో అని అనుమానం వచ్చింది. వెంటనే కూతురిని పిలిచి చెవిలో ఏమైనా ఉందేమో చెక్ చేయమని అడిగింది. తల్లి చెవిలోకి టార్చ్ లైట్ వేసి చూసిన కూతురు ఒక్కసారిగా గావుకేక పెట్టింది. భయంతో వణికిపోయింది. ఆ మహిళ చెవిలో ఏముందో తెలుసుకున్నవారు కూడా షాకయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. గుండె ధైర్యం తక్కువగా ఉన్నవారు ఈ వీడియో చూడకపోవడం బెటర్ అంటున్నారు కొందరు. ఇంతకూ ఈ మహిళ చెవిలో కనిపించిందేమిటో తెలుసుకుంటే..
కర్ణాటక(Karnataka) రాష్ట్రంలో నివసిస్తున్న ఓ మహిళకు విపరీతమైన చెవినొప్పి(Ear pain) వచ్చింది. మొదట్లో తగ్గిపోతుందిలే అనుకుంది కానీ నొప్పి ఎక్కువ కావడంతో చెవిలో ఏదైనా ఉందేమో చూడమని కూతుర్ని అడగింది. కూతురు టార్చి లైట్(Torch Light) వేసి చూడగా.. టార్చి లైట్ వెలుగులో మెరుస్తున్న కళ్ళతో నలుపు, తెలుపు రంగులో అటూ ఇటూ కదులుతూ భయంకరంగా కనిపించింది సాలీడు(Spider). దాన్ని సడన్ గా చూడగానే సినిమాల్లో చూపించే రాక్షస సాలీడు(Monster Spider) లాగే అనిపించింది ఆ అమ్మాయికి. వెంటనే గావుకేక పెట్టి చేతిలో టార్చ్ కిందపడేసి భయంతో వణికిపోయింది. ఏమయ్యిందోనని కుటుంబ సభ్యులు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏం జరిగిందని అడిగారు. అమ్మ చెవిలో సాలీడు ఉందని ఆ అమ్మాయి భయపడుతూ చెప్పింది. కుటుంబ సభ్యులు మహిళ చెవిలో టార్చి లైట్ వేసిచూసి వారు కూడా ఒకింత భయపడ్డారు. అనంతరం ఆమెను ఈఎన్టీ స్పెషలిస్ట్(ENT Specialist) దగ్గరకు తీసుకెళ్ళారు. అక్కడ వైద్యురాలు పరిశీలించి ఆమె చెవిలో ఉన్నది సాలీడేనని ధృవీకరించారు. డాక్టర్ ఆ మహిళ చెవిలో టార్చి లైట్ వేసి కొద్దిసేపు అలాగే ఉంచారు. ఆ సాలీడు మెల్లిగా నడుచుకుంటూ బయటకు వచ్చేసింది. సాలీడు వల్ల మహిళకు ఏమైనా సమస్య ఏర్పడిందా అనే విషయం తెలియలేదు. LADbible అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. సడెన్ గా ఆ సాలీడును చూసి చాలామంది భయపడ్డామని చెబుతున్నారు.
Updated Date - 2023-03-06T19:09:01+05:30 IST